NRI-NRT

వర్జీనియాలో వాలీబాల్ సందడి

Early Winter Volleyball In Virginia - Marquette Spikers Win

అమెరికాలో వేసవి ముగిసి శీతకాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రవాసాంధ్రుడు మైనేని రామ్ ఆధ్వర్యంలో వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. తుదిసమరంలో జవహర్-అమరఏశ్ సారథ్యంలోని మార్కెట్ స్పైకర్స్ కమ్మరి ఆనంద్ నేతృత్వంలోని విండర్‌మియర్ నైట్‌రైడర్స్ జట్లు తలపడగా మార్కెట్ స్పైకర్స్ జట్టు విజేతగా నిలిచింది. మార్కెట్ స్పైకర్స్ జట్టుకు విష్ణు కోచ్‌గా వ్యవహరించారు.