Movies

మత్తెక్కిస్తున్న “సారా”

మత్తెక్కిస్తున్న “సారా”

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా గతేడాది `కేదార్నాథ్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన `సింబా` సినిమాలో నటించింది. అయినప్పటికీ జాన్వీ కపూర్ స్థాయిలో సారాకు గుర్తింపు రాలేదు.రెండు సినిమాల్లోనూ గ్లామర్ విందు చేసే అవకాశం సారాకు రాలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా సారా తన హాట్ఫొటోలను వదులుతోంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా సారా చేసిన ఫొటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన తమ్ముడు ఇబ్రహీంతో కలిసి సారా ఫొటోషూట్లో పాల్గొంది. ఇబ్రహీం సిక్స్ప్యాక్తో సందడి చేయగా, సారా పొట్టి బట్టల్లో మెరిసిపోయింది. ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలకు నెటిజన్లు లైక్ల వర్షం కురిపిస్తున్నారు.