DailyDose

నటి కుష్బూ అరెస్ట్-నేరవార్తలు

నటి కుష్బూ అరెస్ట్-నేరవార్తలు

* తమిళనాడులో భాజపా నేత కుష్బూ సుందర్​ను పోలీసులు అరెస్టు చేశారు.మహిళలు, మనుస్మృతిపై వీసీకే నేత తిరుమలవలన్​ చేసిన వ్యాఖ్యలపై నిరసన చేపట్టేందుకు చిదంబరం వెళుతుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో తనను అరెస్ట్​ చేయడంపై కుష్బూ ట్వీట్​ చేశారు.మహిళల గౌరవం కోసం తుది శ్వాస వరకు పోరాడుతామని తెలిపారు.

* పోలీసుల తీరుపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన ఇంటి ముందు పోలీసులు మోహరించడంతో బయటకు వచ్చిన ఆయన పోలీసులపై మండిపడ్డారు.దీంతో వారు దూరంగా జరిగారు.ఈ సందర్భంగా ఎంపీ ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడారు.తన ఇంటి ముందు పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.అందుకు సమాధానంగా ఛలో ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇవ్వడంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నామని చెప్పడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వలేదని అన్నారు.అసలు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నారా…? ఫాంహౌస్‌లో ఉన్నారా…? అని అరవింద్ ప్రశ్నించారు.

* 18మంది పాక్‌ జాతీయులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.యూఏపీఏ చట్టం కింద 18మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.నిందితులు ముంబయి దాడులు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించామని కేంద్ర హోంశాఖ తెలిపింది. 

* రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్.కందకం రోడ్డులో యువకుడిపై బ్లేడ్ తో దాడి..బ్లేడ్ తో దాడి చేసి డబ్బు లాక్కున్న బ్లేడ్ బ్యాచ్..వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న రాజమండ్రి ప్రజలు.

* విజయదశమి రోజున దేవరగట్టులో ఏటా బన్నీఉత్సవం ఆనవాయితీగా వస్తోంది.పోలీసులు అడ్డుకోవాలని చూడడం గ్రామస్థులు కర్రల సమరానికి దిగడం కూడా అలవాటైపోయింది.ఐతే ఈసారి కరోనా నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు.బన్నీ ఉత్సవాలకు అనుమతే లేదని విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.కర్ణాటక నుంచి వచ్చేవారికి రాకుండా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ ఆంక్షలేవీ భక్తుల్ని ఆపలేకపోయాయి.వందల మంది కాలినడకన దేవరగట్టు చేరుకుని ఉత్సవాన్ని నిర్వహించారు.దేవరగట్టులో భక్తులదే పైచేయిగా నిలిచింది.అధికారుల ప్రయత్నంలో భాగంగా కర్రలు తీసుకురావడం తగ్గినా ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

* పాకిస్థాన్‌లోని పేషావ‌ర్‌లో దారుణం జ‌రిగింది.  ఓ శిక్ష‌ణ స్కూల్‌లో జ‌రిగిన పేలుడులో ఏడు మంది మృతిచెందారు. ఆ ఘ‌ట‌న‌లో మ‌రో 70 మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు పేషావ‌ర్ పోలీసు ఆఫీస‌ర్ మ‌న్సూర్ అమ‌న్ తెలిపారు.ఐఈడీతో పేలుడుకు పాల్ప‌డి ఉంటార‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. క్లూస్ సేక‌రిస్తున్నారు.స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న స‌మ‌యంలో పేలుడు జ‌రిగిన‌ట్లు పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఎవ‌రో ఓ వ్య‌క్తి బ్యాగ్‌తో ఆ శిక్ష‌ణాల‌యంలోకి వెళ్లిన‌ట్లు తెలిపారు. గాయ‌ప‌డ్డ‌వారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ది.