WorldWonders

మద్యం బాబులతో తెలంగానాకు ₹1374 కోట్ల ఆదాయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసలు పండుగ జరుపుకొంటారా..? అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే గతానికంటే ఎక్కువగానే పండుగను జరుపుకొన్నారు. కరోనా ఆర్థిక ప్రభావం దసరా పండగ మీద ఏం మాత్రం ప్రభావం చూపలేదు. షాపింగ్ లతో పాటుగా, మద్యం కూడా పోటీపడింది. దసరా బతుకమ్మ సందర్భంగా దాదాపు మూడు నాలుగు రోజులు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈసారి ఆదివారం దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే అమ్మకాల్లో ఊపు వచ్చింది. లాక్ డౌన్ తో ప్రజల ఆదాయం తగ్గినా అది మద్యం ప్రవాహాన్ని ఆపడంలో ఏమాత్రం ప్రభావం చూపలేదని తేలింది. దసరా రోజున ఆదివారం రూ.100 కోట్ల ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆరోజు కూడా మద్యం విక్రయాలు బాగానే సాగాయి. మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో రూ.406 కోట్ల మద్యం విక్రయించినట్టు తెలుస్తోంది. గతేడాది వారం రోజుల్లో రూ. 1374 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ. 1979 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.