Kids

పండిత సభలో కొంటె ప్రశ్నలకు అవధాని గారి సమాధానాలు

పండిత సభలో కొంటె ప్రశ్నలకు అవధాని గారి సమాధానాలు

*అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు*_️?
*ప్రశ్నికుడు*:-
1 . రైలు పట్టాలకూ,
కాలి పట్టాలకూ
అనుబంధం ఏమిటి?
*అవధాని:-*
రైలు పట్టాల మీద వుంటుంది,
కాలి మీద పట్టాలుంటాయి.
*ప్రాశ్నికుడు:-*
2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?
*అవధాని:-*
న్యాయస్థానములో వున్న
న్యాయదేవత. కళ్ళకు *గంతలు* కట్టి వుంటారు కదా!
*ప్రా:-*
3 . సోమవారాన్ని ‘మండే’ అనెందుకంటారు?
*అవ:-*
ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా!
అందుకని ‘మండే’ అంటారు.
*ప్రా:-*
4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?
*అవ:-*
*కని-పెంచుట* లేదు .
*ప్రా:-*
5 . ఈ రోజుల్లో పిల్లలు
తల్లిని Head Cook గా
చూస్తున్నారు .
మరి తండ్రిని
ఎలాచూస్తున్నారు?
*అవ:-*
*ATM* లాగా చూస్తున్నారు.
*ప్రా:-*
6 . సభలో ఎవరైనా
ఆవులిస్తే మీరేమి చేస్తారు?
*అవ:-*
పాలిచ్చేవైతే అవధానం
అయ్యాక యింటికి తోలుకెళ్తా .
*ప్రా:-*
7 . మనిషికి
ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
*అవ:-*
*’పబ్లిసిటీ ‘*
*ప్రా:-*
8 . తుద+ తుద = తుట్టతుద,
కడ + కడ = కట్టకడ
అవుతుంది కదా!
అరటి + అరటి
ఏమవుతువుంది?
*అవ:-*
అర టీ + అర టీ
*ఫుల్ టీ* అవుతుంది.
*ప్రా:-*
9 . క్రికెట్ ప్లేయరుకీ,
అవధానికీ
సామ్యం ఉందా?
*అవ:-*
వాళ్ళు *world play* కి వెళ్తారు ,
మేము *words play* కి వెళ్తాము.
*ప్రా:-*
10 . ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు?
*అవ:-*
“పురుషులందు
పుణ్యపురుషులు
*ఏరయా?* అంటాను.
*ప్రా:-*
11 . దేవుని గుడికి
తాళం వెయ్యాలా?
*అవ:-*
భజన జరిగే చోట
*తాళం* తప్పనిసరి.
*ప్రా:-*
12 . అద్దం ముందున్న
ఆడువారికీ,
మైకు ముందున్న
అమాత్యులకీ
తేడా ఏమిటి?
*అవ:-*
_ఇద్దరికీ *సమయం* తెలియదు!_
చదివి ఆనందించండి – పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి…..స్వచ్ఛమైన.నవ్వు నవ్వండి మన భాషను అందులోని గాంభీర్యాన్ని