NRI-NRT

UAEలో ప్రవాస భారతీయులకు భారత సర్కార్ బంపర్ ఆఫర్

NRIs In UAE Can Now Enter Two Addresses In Their Passports

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఎఈ)లో నివసించే భారతీయులకు తమ పాస్‌పోర్ట్‌లో భారతీయ చిరునామాతో బాటు అక్కడి చిరునామాను కూడా జతచేయగల వెసులుబాటు లభించనుంది. అయితే తమ పాస్‌పోర్టుపై చిరునామా కూడా కావాలనుకునేవారు కొత్త పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. దుబాయిలో రాయబార కార్యాలయ పాస్‌పోర్ట్‌ కాన్సుల్‌ సిద్దార్థ కుమార్‌ బరేలీ తెలిపారు. తదనంతరం వారికి దుబాయి చిరునామాతో కూడిన కొత్త పాస్‌పోర్టు జారీ చేస్తామన్నారు. ఎమిరేట్స్‌లో స్వంత లేదా అద్దె ఇంట్లో ఉండే వారెవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని కుమార్‌ తెలిపారు. నూతన పాస్‌పోర్ట్‌ దరఖాస్తులో భారత్‌, యుఏఈ రెండు చిరునామాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్థానిక చిరునామా కలిగిన డీఈడబ్యుఏ, ఎఫ్ఈడబ్యుఏ, ఎస్‌ఈడబ్యుఏ బిల్లులు, రెంటల్‌ అగ్రిమెంట్లు, టైటిల్‌ డీడ్‌, టెలిఫోన్‌ బిల్లులను నివాస ధృవపత్రాలుగా అంగీకరిస్తామని దుబాయి రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.