Movies

వేషంలో గడుసుదనం-మనసంతా మమకారం

వేషంలో గడుసుదనం-మనసంతా మమకారం

ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్తగారిని (అదేనండీ మన సూర్యకాంతం గారి గురుంచి) రేపు అనగా 28-10-20 నాడు ఆమె జయంతి సంధర్భంగా ఆమెను ఒకసారి గుర్తు చేసుకొందాము.
సూర్యకాంతం, ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో – ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా – ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి – అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.
ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు – “నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. ‘సూర్యకాంతం’ అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు”
జీవిత విశేషాలు
• సూర్యకాంతం గారు తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ దగ్గరున్న వెంకట క్రిష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లిదంద్రులకు 14వ సంతానంగా జన్మించింది.
• సూర్యకాంతం గారి తండ్రి పేరు పొన్నాడ అనంతరామయ్య గారు, తల్లిపేరు వెంకట రత్నమ్మ గారు.
• సూర్యకాంతం గారి భర్తపేరు పెద్దిబోట్ల చలపతిరావు గారు (హైకొర్టు జడ్జీ, వీరి వివాహం 1950 లో జరిగింది.)
• సూర్యకాంతం గారు వృత్తిలో సాధించిన విజయాలు సహజ నట శిరొమణీ, హస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్తల సిరోమణి.
• (1) సూర్యకంతం గారికి మహానటి సావిత్రి గారి జ్ఞాపకచిహ్నము పురస్కారం లభించింది. (2) గౌరవ డాక్టరేట్ పురస్కారాని పద్మావతి మహిళా యూన్వర్సిటీ నుండి అందుకొన్నారు.
• సూర్యకాంతం గారు నటించిన మేటి చిత్రాలు బ్రతుకుతెరువు, దొంగరాముడు, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మాంగల్యబలం ,
ఇద్దరు మిత్రులు, వాగ్దానం, వెలుగునీడలు, మంచిమనసులు, రక్తసంబంధం, సిరిసంపదలు, గుండమ్మకథ, చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు,
డాక్టర్ చక్రవర్తి, ఉమ్మడికుటుంబం, ఆత్మీయులు, దసరాబుల్లోడు, అమాయకురాలు, కాలం మారింది మొదలగునవి.
• . సూర్యకాంతం గారు ఒక ప్రముఖ సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది.
• కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.
• ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి – సూర్యకాంతం, రమణారెడ్డి – సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు – సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ – ఎదురు చూసేవారు.
• సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
• సూర్యకాంతం గారి ఆఖరి చిత్రం ఎస్ పి పరశురాం (1994).
• సూర్యకాంతం గారు డిసంబర్ 18, 1994న హైదరాబాదులో తన 70వ ఏట మరణించారు.
నటించిన సినిమాలు
ధర్మాంగద (1949), సంసారం (1950), పెళ్ళిచేసి చూడు (1952), బ్రతుకుతెరువు (1953), కన్యాశుల్కం (1955) (మీనాక్షి), దొంగరాముడు (1955), చరణదాసి (1956), శ్రీ గౌరీ మహత్యం (1956), భాగ్యరేఖ (1957), మాయాబజార్ (1957), తోడికోడళ్ళు (1957), దొంగల్లో దొర (1957), అప్పుచేసి పప్పుకూడు (1959), మాంగల్యబలం (1959), కృష్ణలీలలు (1959), భాగ్యదేవత (1959), జయభేరి (1959), శాంతినివాసం (1960), ఇద్దరు మిత్రులు (1961), పెళ్లికాని పిల్లలు (1961), భార్యా భర్తలు (1961), వాగ్దానం (1961), వెలుగునీడలు (1961), శభాష్ రాజా (1961 కలసి ఉంటే కలదు సుఖం (1961), మంచిమనసులు (1962), రక్తసంబంధం (1962), సిరిసంపదలు (1962), గుండమ్మకథ (1962), తిరుపతమ్మకథ (1963), నర్తనశాల (1963) (అథిది పాత్ర), పరువు ప్రతిష్ఠ (1963), చదువుకున్న అమ్మాయిలు (1963), మురళీకృష్ణ (1964), మూగమనసులు (1964), డాక్టర్ చక్రవర్తి (1964), ఉయ్యాల జంపాల (1965), నవరాత్రి (1966), సంగీతలక్ష్మి (1966), ఆస్తిపరులు (1966), కన్నెమనసులు (1966), బ్రహ్మచారి (1967), సుఖ దు:ఖాలు (1967), ఉమ్మడికుటుంబం (1967), అత్తగారు-కొత్తకోడలు (1968), బుద్ధిమంతుడు (1969), ఆత్మీయులు (1969), బాలరాజు కథ (1970), దసరాబుల్లోడు (1971), అమాయకురాలు (1971), కాలం మారింది (1972), కొడుకు కోడలు (1972), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), సెక్రటరి (1976), గోరంతదీపం (1978), రాధాకృష్ణ (1978), కార్తీక దీపం (1979) (శారదా తల్లి), వియ్యాలవారి కయ్యాలు (1979), చుట్టాలున్నారు జాగ్రత్త (1980), పెళ్ళిచూపులు (1983 బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989), వన్ బయ్ టూ (1993)