Health

కాలు విరిగితే ₹80వేలు. ఆరోగ్యశ్రీ ఉంటే ₹1.3లక్షలు.

కాలు విరిగితే ₹80వేలు. ఆరోగ్యశ్రీ ఉంటే ₹1.3లక్షలు.

ఆరోగ్య శ్రీ ,హెల్త్ కార్డులు లేదంటున్న హస్పటల్స్

ప్రభుత్వ హెచ్చరికల్ని పట్టించంకోని హస్పటల్స్

కనికరం లేని కార్పొరేట్ కర్కోటకకులు

నిరాశతో వెనుదిరుగుతున్న నిరుపేద రోగులు

పేదల ప్రాణాలు గాలీలో

ఏఓక్క నిరుపేద వైధ్య లేదని వారి ప్రాణాలు పోగూడదనే సదుద్దేశంతో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టారు.

ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టకముందు పేదవాడి గుండే జబ్బులు వస్తే చావు కోసం ఏదురు చూసే వారు.

స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టిన తరువాత ఏటువంటి జబ్బు వచ్చిన మాకు ఏమి కాదు అనే భరోసాతో ఉన్నారు.

ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు పేదవాడి ఆరోగ్య పై దృష్టి పెట్టలే ఆరోగ్య శ్రీ పేరట కార్పొరేట్ హస్పటల్స్ దోపిడి వందల కోట్లలలో సాగింది.

కోద్ది పాటి వందల్లో వైధ్యానికి వేలల్లో ,వేలల్లో వైద్యానికి లక్షల్లో ఫీజులు వసూలు చేశారు.

అయినా కొంతవరకు పేదవాడికి సహయం అందుతుందని మేథావులు మిన్నకుండ ఉండిపోయారు.

ఎల్ ఓసి రావాలంటే చాలా తతంగం ఉండేది.

కాని నేడు ఓక్క పూటలోనే వచ్చే విధంగా రూట్ మ్యాప్ లు చేసుకున్నారు.

సంవత్సరానికి ప్రతి హస్పటల్ కి కనీసం వందల కోట్ల రూపాయల ఆరోగ్య శ్రీ పేరట దోపిడి చేసే వారు.

ఉదాహరణకు మాఫ్రెండ్ వాళ్ళ అన్నయకు ఎక్సిడెంట్ అయితే కాలు విరిగింది చికిత్స నిమిత్త బెంజిసర్కీల్ వద్ద గల హస్పటల్ కి తీసుకెళితే ఆయన చికిత్సకు చికిత్సకు 80 వేలు అవుతుందన్నారు ఆరోగ్య కార్డు ఉందని చెప్పడంతో ఏకంగా లక్షా ముప్పై వేలుగా బిల్ చేశారు.ఈ విధంగా దోపిడి కొనసాగించారు.

ప్రభుత్వాలు మారేతే విధానాలు మారుతాయా?

గత ప్రభుత్వ హయంలోవందల కోట్ల రుపాయలు బకాయిలు పడిన నిరాటంకంగా వైధ్యం అందింది.

ఏటువంటి అటంకం లేకుడనే నిరాటంకంగా సాగింది.

గత ప్రభుత్వం నుండి ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నాటికి ఆరోగశ్రీ బకాయిలు 500 కోట్ల రూపాయలు బాకీగా తేలింది.

ప్రభుత్వం మారటంతో బకాయిలు పేరుతో ఆరోగ్య శ్రీ సేవాల్ని నిలిపివేయడం గమనార్హం.

అప్పటి కుంటి నడకన ఆరోగ్య శ్రీ సేవలు అందించడం జరుగుతుంది.

ఎన్నో ప్రాణాలు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నా కర్పోరేట్ కర్కోటకులకు కనికరం లేదు.

పేదవాడి వైధ్యాన్ని నిరాకరిస్తు వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్న కర్పోరేట్ హస్పటల్స్ పని పట్టాలని కోరుతున్నారు.