ScienceAndTech

హార్లే నుండి విద్యుత్ సైకిల్

హార్లే నుండి విద్యుత్ సైకిల్

హ్యార్లీ డేవిడ్ సన్. యూత్ లో ఈ బైక్స్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ళ తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది. సీరియల్ వన్ సైకిల్ కంపెనీ పేరుతో ఈ సైకిళ్ల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. సీరియల్ 1 అనేది 1903లో హ్యార్లీ డేవిడ్ సన్ కు సంబంధించిన పురాతనమైన బైక్ నిక్ నేమ్ కావటం విశేషం. ఈ సైకిళ్ల కంపెనీ నుంచి తొలి ఉత్పత్తి 2021 ఏప్రిల్ సమయంలో రానుంది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఈ బైక్ మార్కెట్ కు డిమాండ్ పెరుగుతోంది. 2019 అంచనాల ప్రకారం అంతర్జాతీయ ఈ సైకిల్ మార్కెట్ 15 బిలియన్ డాలర్లుగా ఉంటుదని అంచనా వేశారు. 2020 నుంచి 2025 వరకూ ప్రతి ఏటా ఆరు శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని లెక్కలేశారు. కంపెనీ తాజాగా ఈ సైకిల్ కు చెందిన మోడల్ ఫోటోలను విడుదల చేసింది. అత్యంత సంక్లిష్టమైన సమయంలో కంపెనీ సైకిళ్ల మార్కెట్లోకి ప్రవేశిస్తోందని చెబుతున్నారు. కరోనా కారణంగా జులైలో హార్లే డేవిడ్ సన్ 700 మంది ఉద్యోగులను తొలగించింది.