Politics

షాపూర్‌జీకి తెలంగాణా నూతన సచివాలయ నిర్మాణ కాంట్రాక్టు

షాపూర్‌జీకి తెలంగాణా నూతన సచివాలయ నిర్మాణ కాంట్రాక్టు

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌ జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకుంది. ఈ మేరకు షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థకు ఆర్ అండ్ బీ శాఖ అంగీకార పత్రం ఇచ్చింది. సచివాలయ నిర్మాణ పనులకు రూ. 494 కోట్లకు టెండర్ పిలువగా షాపూర్ జీ పల్లోంజీ నాలుగు శాతం ఎక్కువగా కోట్ చేసింది. అయితే 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్‌లో ప్రభుత్వం షరతు విధించింది.