Food

ద్రాక్ష క్యారెట్ బ్రకోలీ తినాలి

ద్రాక్ష క్యారెట్ బ్రకోలీ తినాలి

ద్రాక్షపండ్లు: వీటిలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది పలు రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. వీటిలోని లైకోపిన్‌ చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడి, మృదువుగా మారుస్తుంది.
*క్యారట్‌:
దీనిలోని విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణనిస్తాయి. చర్మ ముడతలు, రంగు పేలిపోవడం, మచ్చలు వంటివి ఏర్పడకుండా చూస్తాయి.
*పాలకూర:
ఐరన్‌కు ఇది మంచి వనరు. దీనిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి. రక్తహీనతను దూరం చేసి చర్మానికి రంగునిస్తాయి.
*బాదం:
ఈ డ్రై ఫ్రూట్‌ చర్మానికి తేమనందిస్తుంది. వీటిలోని విటమిన్‌ ఇ సూర్యకిరణాల బారినుంచి చర్మానికి రక్షణనిస్తుంది.
*గ్రీన్‌ టీ:
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపి చర్మానికి సహజ మెరుపునిస్తాయి. గీతలు, ముడతల్ని మాయం చేసి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
*సబ్జా గింజలు:
వీటిలో అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి.
*బ్రకోలి:
క్రుసిఫెరస్‌ జాతికి చెందిన ఈ కూరగాయలో ఎ,సి విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. విటమిన్‌ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది. బ్రకోలి తింటే చర్మం పొడిబారడం, మచ్చలు ఏర్పడడం వంటివి తగ్గిపోతాయి.