DailyDose

దుబ్బాకలో 144 సెక్షన్-నేరవార్తలు

దుబ్బాకలో 144 సెక్షన్-నేరవార్తలు

* ఉప ఎన్నికలు జరుగుతోన్న దుబ్బాక అసెంబ్లీలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు సిద్దిపేట పోలీస్ కమిషనర్‌… సిద్దిపేట జిల్లాలో ఉన్న దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది… దీంతో.. ఎన్నికలు జరిగే గ్రామాల్లో, మండలాల్లో, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను… నవంబర్‌ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ 144 సీఆర్‌పీసీ సెక్షన్‌ అమలు చేస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సిద్దిపేట సీపీ.

* నవంబర్ ఒకటవ తేది నుండీ 30 వరకు అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో “30 పోలీసు యాక్టు” అమల్లో ఉంటుందని అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి , గొల్ల గ్రామాల మధ్య శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం పాలయ్యారు.

* రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి లోని వరద బాధితుల సహాయం తమకు అందలేదని సులేమాన్ నగర్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని మహిళలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి దగ్గర ధర్నాకు దిగారు. వరద సహాయం పక్కదారి పడుతోందని రాత్రిపూట దొంగచాటుగా అధికారులు డబ్బులు పంచుకున్నారని, మహిళలు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్యే ఇటు నుంచి కదలమని భీష్మించుకుని కూర్చున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద బాధితుల తరపున మెమోరాండం అందజేయడానికి కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ లలిత్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకోగా ఎమ్మెల్యే ఇంటి వద్ద లేకపోవడంతో వెనుదిరిగిగారు.