Movies

అజయ్‌తో మళ్లీ రైడ్

అజయ్‌తో మళ్లీ రైడ్

గత ఏడాది హీరో అజయ్‌ దేవగన్‌ బాలీవుడ్‌ వెండితెరపై చేసిన ‘రైడ్‌’ బాక్సాఫీస్‌ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్లీ ‘రైడ్‌’ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అజయ్‌. తొలి రైడ్‌లో అజయ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన ఇలియానాయే మలి రైడ్‌లోనూ నటించబోతున్నారని బాలీవుడ్‌ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్‌’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్‌ నేపథ్యంలో ‘రైడ్‌’కు సీక్వెల్‌ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్‌ దేవగన్‌. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి.. రెండో ‘రైడ్‌’కు కూడా రాజ్‌కుమార్‌ గుప్తాయే దర్శకత్వం వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.