Politics

ఏపీకి నవంబరు 1 ఎప్పుడూ ప్రత్యేకమే!

ఏపీకి నవంబరు 1 ఎప్పుడూ ప్రత్యేకమే!

అనేక పోరాటాల ఫలితంగా 1నవంబర్ 1956న ఆంథ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భయించింది.అనేక బాలారిష్టాలు ఎదుర్కొని ఏర్పడిన రాష్ట్రం ముందు,వెనుక చరిత్రను మనం చేసుకుందాం.భారత దేశం స్వాతంత్ర్యం సాధించాక ఏర్పడిన తరువాత తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంథ్ర రాష్ట్రం.అరవ వాళ్ళనుండి అనేక త్యాగాల ఫలితంగా తెలుగు బాష మాట్లాడే ప్రజలకు రాష్ట్రం ఏర్పడింది.శ్రీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 15 అర్థరాత్రి మరణించే వరకు 58 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేశారు.ఫలితంగా జవహర్ లాల్ నెహ్రు నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దిగివచ్చి 1952 డిసెంబర్ 19న ఆంథ్రరాష్ట్రం ఏర్పాటును ప్రకటించారు.అది అన్ని రాజ్యాంగ నియమాలను పూర్తిచేసుకొని 1అక్టోబర్ 1953లో కర్నూలు రాజధానిగా ఆంథ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంథ్రరాష్ట్రం ఏర్పడింది.శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మద్రాసు లేదా రాయల సీమలోని ఏదొక పట్టణం రాజధానిగా ఆంథ్రరాష్ట్రం ఏర్పాటుచేస్తామని 1951లో ప్రకటించిన నెహ్రు ఆ తరువాత ఆ ప్రస్తావనే చేయలేదు.దానితో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షతో వారి బలిదానం ద్వారా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి ప్రకటించిందే తెలుగురాష్ట్రం.ఆనాడు ప్రతి తెలుగోడు గర్వించ తగ్గ క్షణం.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1937 నవంబర్ 16 న 8మంది పెద్దమనుషుల మధ్య జరిగిందే శ్రీ బాగ్ ఒప్పందం లేదా పెద్ద మనుషుల ఒడంబడిక అంటారు.రాయలసీమ ప్రయోజనాలే దీని ముఖ్యోద్దేశ్యం.శ్రీ బాగ్ ఒప్పందంలో ముఖ్యాంశాలు.అవి 1.తెలుగు మాట్లాడే రాయలసీమ,సర్కారు తీర ప్రాంత జిల్లాలు కలిపి ఆంథ్రాప్రజలకు రాష్ట్రం ఏర్పడాలి.2.మద్రాసు లేదా రాయల సీమలోని ఏదో ఒకపట్టణం రాజధానిగా అయిఉండాలి.3.శాసన సభలో రాయలసీమకు సరియైన ప్రాతినిథ్యం ఉండాలి.4.మంత్రులు సమానంగా ఉండాలి.5.ఆర్థిక వెనుకబాటుతనం మూలాన తుంగభద్ర,హగరి ప్రాజెక్టులు చేపట్టాలి.6.రాష్ట్రఆదాయాన్ని సమానంగా పంచాలి అనే మౌలిక సూత్రాలే శ్రీ బాగ్ ఒప్పందం.దీన్ని మద్రాసు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.సభ ఆమోదం తరువాత 8మంది పెద్దమనులు మద్రాసు నగరంలోని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఇంట్లో సమావేశమయ్యారు.వారి నివాసం పేరే శ్రీ బాగ్ నిలయం.అందుకే ఇది శ్రీ బాగ్ ఒప్పందం.దీని తరువాత 10 ఏళ్ళకు స్వాతంత్ర్యం వచ్చినా రాష్ట్రకల నెరవేరలేదు.స్వాతంత్ర్యం సిద్థించిన15 ఏళ్ళకు ఉద్యమాలు,ప్రాణత్యాగాలతో మనం రాష్ట్రం సాధించుకొని సంపద మద్రాసు వదలి కట్టుబట్టలతో 1అక్టోబర్ 1953కి కర్నూలు చేరాం.దాన్నైనా స్థిరంగా ఉంచుకుంటే నేటి ఈ దుస్థితి ఆంథ్రాప్రజలు అనుభయించేవారు కాదు.కాని ఎల్లవేళలా ఒకే రకంగా ఉండదు.

1953 డిసెంబర్ లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు ఏర్పడిన ఫజల్ ఆలీ కమిటి తమ రిపోర్ట్ ను సబ్మిట్ చేస్తూ నైజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ మరియు ఆంథ్రరాష్త్రం సంయుక్తంగా ఆంథ్రప్రదేశ్ ఏర్పడాలని రిపోర్ట్ లో పేర్కేంది.తెలంగాణా ప్రాంతంలోని కమ్యునిస్టు ప్రాబల్యం అధికంగా ఉండుటవలన సంయుక్త రాష్ట్రం విశాలాంథ్ర ఏర్పాటుకు అసెంబ్లీ లో తీర్మానం చేయండి లేదా మేము రాజీనామాలు చేస్తాం ఎన్నికలు వెళదాం అనే సాహసోపేత నిర్ణయంతో రెండు రాష్ట్రాలు విలీనమై 1నవంబర్ 1956 న హైదరాబాద్ రాజధాని శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఆంథ్రప్రదేశ్ అవతరించింది.హైదరాబాద్ స్టేట్ లో మరాఠి మాట్లాడేవారిని మహరాష్ట్రకు,కన్నడం మాట్లాడేవారిని కర్నాటకకు బదిలీచేశారు.దీనితో కర్నూలు ఖాళీ చేసి భాగ్యనగరం చేరాం.భాషా ప్రయుక్తరాష్ట్రాలలో మొట్ట మొదట ఏర్పడిన రాష్ట్రం ఆంథ్రప్రదేశ్.1నవంబర్ 1956 నే కర్నాటక,కేరళ కూడా ఏర్పడ్డాయి.

ఉద్యోగ,ఉపాధి నిధులు,నుళ్ళ కొరకు 1969 లో తెలంగాణా ఉద్యమం వచ్చింది.దాన్ని కొన్ని రాయితీలతో చల్లార్చారు.మరల 1972 లో జై ఆంథ్ర,తెలంగాణా ఉద్యమాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేశారు.వీటి మధ్య మరల విశాలాంథ్ర ఉద్యమం ఫైనల్ ఆంథ్రప్రదేశ్ విడిపోకుండా నిలబడింది

కాని మరల 2001 నుండి తెలంగాణా ఉద్యమం ఆవిర్భయించింది.2013 కి ఉద్యమం తీవ్రదశకు చేరుకొనగా నాటి యు.పి.ఏ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసి మరీ ఆంథ్ర తెలంగాణాను విడదీసింది.దానికి యన్ డిఎ వంతపాడింది.మన ప్రాంత ప్రజలు సమైఖ్యాంథ్ర ఉద్యమం చేసినా కేంద్ర పెద్దలు లెక్కచేయలేదు.2014 జూన్ రెండున గుంటూరు,విజయవాడ మధ్య కృష్ణానదీతీరానికి చేరాం.

మన భాష కు రాష్ట్రం దొరికింది గాని దురదృష్టవశాత్తు మొదట మద్రాసు కోల్పోయాం.నేడు భద్రాచలం కోల్పోయాం.అభివృద్థి చేసిన హైదరాబాద్ నుండి రిక్తహస్తాలతో వచ్చాం.మొదట్లో ఏర్పడిన కర్నూలును అభివృద్థి చేసుకోలేక పోయాం.930కిమీ తీర ప్రాంత ముండి కృష్ణా,గోదావరి వాటి ఉపనదులు మన నేలపై పారి సిరులు కురిపిస్తున్నా మన మేథాసంపత్తి శ్రమ,సంపద అందరికీ పంచడానికే సరిపోయింది.ఆ నాడు శ్రీ బాగ్ ఒప్పందం తాలూకా ఆశయాలు రాయలసీమ సమగ్రాభివృద్థి నేటికి జరగలేదు.75 ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో ఇంతగా దగాపడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఆంథ్ర ప్రాంతం మాత్రమే అంటే అతియోశక్తి లేదు.

గతం గతంః.ఇప్పటికైనా 13 జిల్లాల సమగ్రామాభివృద్థికి పాలకులు చిత్తశుద్థితో కృషి చేసి ఆంథ్రప్రదేశ్ ప్రజల కలలను నెరవేర్చాలి.మన యువతకు విద్య,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి.రైతు పండించినపంటకు గిట్టుబాటు ధర రావాలి.పారిశ్రామిక అభివృద్థి ద్వారా శ్రామికుల జీవితంలో వెలుగులు విరజిమ్మాలి.ప్రాంతీయ విభేధాలకు తావులేకుండా రాయలసీమ,కోన్తాంథ్ర,ఉత్తరాంథ్ర సమాన అభివృద్థి సాధించాలి.తెలుగు వారికి ఓ రాష్ట్రం కావాలనేది దాదాపు 100 ఏళ్ళ కల.కాలక్రమంలో అయి రెండు అయ్యాయి.కాబట్టి 1నవంబర్ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాంగా ఏర్పడిన మన ఆంథ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని చాటిచెబుదాం.తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచ నలుమూలలకు వ్యాప్తిచేద్దాం.జై ఆంథ్ర ప్రదేశ్ జైజై ఆంథ్ర ప్రదేశ్

అప్పారావు మూకల ఉపాధ్యాయ సేవాకేంద్రం,విజయవాడ