Movies

“అంజి” మాంత్రికుడు…నిజ జీవితంలో ఓ బిచ్చగాడు

“అంజి” మాంత్రికుడు…నిజ జీవితంలో ఓ బిచ్చగాడు

‘‘ఇక గ్రాఫిక్స్‌ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌వేసుకునే వాళ్లు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే కాస్ట్యూమ్‌ను కొనసాగించాం. ‘అంజి’ సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే, అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ, చూడగా, చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్‌ ఇవ్వాలంటే అది శ్యాంగారికి. ఆ తర్వాత చిరంజీవిగారికి. చిరంజీవిగారు, హీరోయిన్‌, విలన్‌ తప్పితే మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ఒకవేళ ఈ ఐదేళ్లలో ఎవరైనా చేయకపోతే అదే పోలికలున్న వ్యక్తిని పెట్టుకోవచ్చని అనుకున్నాం. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. అతను ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రి వద్ద అడ్డుక్కునే వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించాం. అందరం కష్టపడి చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం’’అని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు.