DailyDose

భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం-నేరవార్తలు

భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం-నేరవార్తలు

* హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అతని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ ఆఫీసు ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం (మ)తమ్మలోనిగూడెం.

* హైదరాబాద్ పోలీస్ కమిస్నార్ అంజనీ కుమార్ ప్రెస్ మీట్ పాయింట్స్:#హవాలా ఒక కోటి రూపాయలు స్వాధీనం చేసుకునీ ఇద్దరు అరెస్టు చేసాము#దుబ్బాక (బి జె పి ఎం ఎల్ ఏ ) అభ్యర్ది రఘు నందన్ బావ మరిది సురభి శ్రీనివాస్ రావ్ అరెస్టు చేసాము ఇతను చందా నగర్ కు చెందిన వ్యక్తి.#మరో వ్యక్తి రవి కుమార్ కార్ డ్రైవర్ అరెస్ట్ చేసాము#ఇన్నోవా కారు 2 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం#ఫోన్ లో చాలా కీలక సమాచారం సేకరించను ఫోన్ కాల్ లిస్ట్ లో రగు నందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు.#రగు నందన్ రావు బావ మరిది శ్రీనివాస్ కు విశాఖ ఇండస్ట్రీ నుండి కోటి రూపాయలు హైదరాబాద్ మీదుగా దుభక వెళుతుంది.#నిస్పక్ష పాతంగ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో వుంటారు.

* విశాఖ గాజువాకలో అఖిల్ వెంకటసాయి అనే కుర్రాడు వరలక్ష్మి అనే విద్యార్థినిని దారుణంగా అంతమొందించడంపై సీఐ మల్లేశ్వరరావు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వరలక్ష్మి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో బ్లేడ్, వరలక్ష్మి చున్నీతో పాటు మరికొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. అఖిల్ తో వరలక్ష్మికి ప్రేమ వ్యవహారం ఉందని తెలిపారు. అయితే రామ్ అనే మరో యువకుడితో వరలక్ష్మి సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించిన అఖిల్ ఈ హత్యకు పాల్పడ్డాడని సీఐ వివరించారు.ఘటన జరిగిన సమయంలో స్పాట్ లో అఖిల్, వరలక్ష్మి మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత అఖిల్ పారిపోతుండగా వరలక్ష్మి సోదరుడు చూశాడని తెలిపారు. ఈ కేసులో రామ్ ను కూడా విచారించామని, కేసును దిశ విభాగానికి బదిలీ చేశామని అన్నారు.

* విశాఖపట్నం గాజువాకలో ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి హత్య చేయడంపై సీఎం జగన్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘాతుకాలు జరగకుండా చూడాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్నీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.మహిళల భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సీఎం జగన్… వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలంటూ హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

* అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు ఆప్కారి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా 5 లక్షల విలువచేసే మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.

* నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సిఐ గా విధులు నిర్వహిస్తున్న పల్లె రాకేష్ 70వేల రూపాయలు ఖరీదైన సామ్సంగ్ ఫోన్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు వివరాల్లోకి వెళితే సీఐ పల్లె రాజేష్ తో పాటు ఎస్ఐ మొగులయ్య డ్రైవర్ గజేంద్ర పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఏసీబీ ఇన్చార్జ్ డిఎస్పి రవికుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించడం జరిగింది !బోధన్ పట్టణంలోని రెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో సుదర్శన్ గౌడ్ సోదరుడికి 400 గజాల స్థలం ఉంది అయితే ఆ స్థలాన్ని అమ్మి పెట్టాలని సుదర్శన్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ సాజిద్ ను నెల క్రితం కోరారు డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో సుదర్శన్ గౌడ్ సాజిద్ పై దాడి చేయడమే కాకుండా అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను లాక్కెళ్లాడు దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఎస్సై మొగులయ్య ఫిర్యాదు తీసుకోలేదు కానిస్టేబుల్ను పంపించి బైక్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు తన బండి తనకు ఇవ్వాలని పలుమార్లు వెళ్లిన సీఐ పల్లి రాకేష్ వినలేదు నీ మీద కేసు పెడతాను అంటూ బెదిరించాడు 70 వేల నగదు తో పాటు సెల్ ఫోన్ ఓం కొని ఇవ్వాలని సిఐ కోరడంతో దిక్కుతోచని సాజిద్ అక్టోబర్ నెల ఆరో తారీఖున నిజామాబాదు లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు నిర్వహించారు శనివారం పోలీస్ స్టేషన్ సిఐ కి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు సిఐ తో పాటు ఎస్ఐ మొగులయ్య డ్రైవర్ కేసు నమోదు చేశారు శంకర్ రెడ్డి శివ కుమార్ వెంకట రావు మురళీమోహన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.