Sports

వాట్సన్ రిటైర్మెంట్?

వాట్సన్ రిటైర్మెంట్?

చెన్నై ఓపెనర్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై పలకనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడు భావోద్వేగానికి గురై ఈ విషయాన్ని వెల్లడించాడని సమాచారం. ‘‘ఆఖరి మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో వాట్సాన్‌ భావోద్వేగంతో వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. చెన్నై తరఫున ఆడటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నాడు’’ అని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై షేన్‌ వాట్సన్‌ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.