DailyDose

322వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం-తాజావార్తలు

Telugu Breaking News - Amaravathi Protest Reaches 322nd Day

* రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 322వ రోజుకు చేరుకున్నాయి.మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం,ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నాయి.రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది

* దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు చూసుకుంటే 75 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్‌ బాధితులకు అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా పోలింగ్‌ ‌ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. దీంతో పోలింగ్‌ శాతం మరోసారి 80కు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైంది.

* ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. నిజానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ అక్కడి కాలమానం ప్రకారం.. నవంబరు 3 ఉదయం నుంచి పోలింగ్‌ ప్రారంభిస్తాయి. అయితే ఈశాన్య రాష్ట్రమైన న్యూ హాంప్‌షైర్‌లో మాత్రం అర్ధరాత్రే ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఓటింగ్‌తో అమెరికా ఎన్నికల పోలింగ్‌ మొదలవుతుంది.

* ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే..ధరణి పోర్టల్‌లో భద్రత పరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ..ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశం..భద్రతపరమైన నిబంధనలు పాటించుకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తున్నాయన్న హైకోర్టు..గూగుల్ ప్లై స్టోర్‌లో ధరణి పోర్టల్ పోలిన మరో నాలుగు యాప్స్‌ ఉన్నాయన్న హైకోర్టు..దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలిసికోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందన్న హైకోర్టు..నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు సంబంధించిన ఎలాంటి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్న హైకోర్టు..

* చీరాల పంచాయితీపై దృష్టి పెట్టిన వైసీపీ పెద్దలు.ఆమంచి, కరణం వెంకటేశ్‌లను పిలిపించిన సజ్జల.ఇద్దరితో వేరువేరుగా సమావేశం.రెండ్రోజుల క్రితం కరణం, ఆమంచి వర్గీయుల ఘర్షణ.గొడవపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం.కరణం వైసీపీలోకి రాకతో చీరాలలో ఆధిపత్య పోరు మొదలు.

* నిజాం నవాబుల తీరును తెలంగాణ చరిత్ర చెబుతుందిఅదే ధోరణిలో నేటి నయా టీఆర్‌ఎస్ దొరలుప్రజాస్వామ్యాన్ని తమ యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేశారు.దుబ్బాకలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెప్పాలి.దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో తరతరాల తెలంగాణ చరిత్ర చెబుతుంది’ అని ఆమె అన్నారు.‘అదే ధోరణిలో నేటి నయా టీఆర్‌ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి… తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నాను’ అని విజయశాంతి అన్నారు.

* మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న చైనా కరోనా వైరస్‌ టీకా విషయంలో బహ్రెయిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా టీకాను తమ దేశంలో మంగళవారం నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌(వైద్య సిబ్బంది) అందరికీ అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. బహ్రెయిన్‌ ఆరోగ్య మంత్రి ఫైఖా బింట్‌ సయీద్‌ మాట్లాడుతూ.. ‘ఈ టీకా మొదటి, రెండో దశ ట్రయల్స్‌కు సంబంధించిన సురక్షిమైన ఫలితాలు వచ్చాయి. మూడోదశ ట్రయల్స్‌ కూడా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా కొనసాగుతున్నాయి. మూడో దశలో భాగంగా 7వేల మంది వాలంటీర్లకు టీకా రెండో డోసును ప్రయోగించారు. అత్యయిక పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని కాపాడుకొనేందుకు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయించాం’అని తెలిపారు.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అటు ట్రంప్‌, ప్రత్యర్థి జోబైడెన్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ ఓటర్లకు మరోసారి విజ్ఞప్తిచేశారు. ‘బరాక్‌ ఒబామా నేతృత్వంలో 2008, 2012 ఎన్నికల్లో దేశాన్ని ముందుండి నడిపించడంలో మీరు నాపై నమ్మకం ఉంచారు. ప్రస్తుతం నేను, కమలా హారిస్‌ కలిసి పోటీచేస్తున్నందున.. మాపై మరోసారి నమ్మకాన్ని ఉంచాలని విజ్ఞప్తిచేస్తున్నా. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంతోపాటు ప్రజల మన్ననలను చూరగొంటాం. మిమ్మల్ని నిరాశ పరచమని హామీ ఇస్తున్నా’ అని అమెరికన్లకు ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

* అగ్రరాజ్యంలోని పలురాష్ట్రాల్లో ముందస్తు, పోస్టల్‌ ఓటింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం రాత్రి నాటికి 98 మిలియన్లకు పైబడి అమెరికన్‌ పౌరులు తమ ఓటుహక్కును నియోగించుకున్నారు. 2016 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్ల కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. ‘యూఎస్‌ ఎలక్షన్స్‌ ప్రాజెక్ట్‌’ గణాంకాల ప్రకారం అమెరికాలోని అత్యధిక జనాభా గల పది రాష్ట్రాల్లో.. రెండింట మూడువంతుల మంది శనివారం నాటికే పోస్టల్‌ ఓటు వేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే అమెరికాలో గత వంద సంవత్సరాల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో.. పోలింగ్‌ శాతం అరవైకి పైబడిన సందర్భాలు కేవలం నాలుగే అనేది నమ్మలేని నిజం. కాగా, పోస్టల్‌ ఓటింగ్‌ మాదిరి జోరు ప్రత్యక్ష ఓటింగులో కూడా కనిపిస్తే అది ఓ కొత్త రికార్డే అని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఈ అంశంపైనే రిపబ్లికన్ల ఆశలన్నీ ఉన్నాయనేది కూడా నిర్వివాదం. ఈ నేపథ్యంలో 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా ఓటు వేయాల్సింది ఎవరు? అనే కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇక దీని సమాధానమే అమెరికా 46వ అధ్యక్షుడిని నిర్ణయించనుంది అనటం అతిశయోక్తి కాదు.