Movies

వెనుక తలుపు

వెనుక తలుపు

పూర్ణ కథానాయికగా కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. బి. శ్రీనివాసరెడ్డి నిర్మాత. సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ సినిమా. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ ‘బ్యాక్‌ డోర్‌’ ఎంట్రీ అన్నది చాలా సహజంగా జరుగుతున్నది. అటువంటి ‘బ్యాక్‌ డోర్‌’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. పూర్ణ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించి, శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. నటిగా సవాల్‌తో కూడుకున్న పాత్ర లభించిందని పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ప్రణవ్‌ సంగీత దర్శకుడు.