Politics

జనసేన తెలంగాణా కమిటీల నియామకం

తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి రాష్ట్రస్థాయిలో యువజన, విద్యార్ధి, మహిళా విభాగాలను ఏర్పాటు చేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థి, యువజన కమిటీలను నియమించారు. కమిటీల ఎంపిక బాధ్యతను చేపట్టిన శ్రీ బి. మహేందర్ రెడ్డి (జనసేన ఉపాధ్యక్షులు), శ్రీ ఎన్.శంకర్ గౌడ్ ( జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి), శ్రీ రామారావు (జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ), శ్రీ రామ్ తాళ్ళూరి (జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు) బృందం తమ నివేదికను శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందచేసింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో వకీల్ సాబ్ షూటింగ్ స్పాట్ లో ఈ బృందం శ్రీ పవన్ కల్యాణ్ గారితో భేటీ అయింది. వారిచ్చిన నివేదికలను పరిశీలించి విద్యార్థి, యువజన విభాగాల కమిటీలను, సాంస్కృతిక విభాగం కార్యదర్శి నియామకానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 డివిజన్లకు కమిటీలను నియమించారు.
జనసేన పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా శ్రీ టి.సంపత్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఎమ్.రామకృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడిగా శ్రీ వి.లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ ఎస్.కిరణ్ కుమార్, సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా శ్రీ దుంపటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కమిటీల వివరాలు ఇవి…
జనసేన పార్టీ తెలంగాణ విద్యార్ధి విభాగం
శ్రీ టి. సంపత్ నాయక్ – ప్రెసిడెంట్
శ్రీ జి. రవీందర్ రెడ్డి – వైస్ ప్రెసిడెంట్
శ్రీ బి. నరేష్ – వైస్ ప్రెసిడెంట్
శ్రీ ఎమ్. రామకృష్ణ – జనరల్ సెక్రటరీ
శ్రీ కె. పవన్ కుమార్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ
శ్రీ ఆంజనేయులు గౌడ్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ
శ్రీ ఆర్. గోపినాథ్ పటేల్ – సెక్రటరీ
శ్రీ ఎస్. శరత్ కుమార్ – సెక్రటరీ
శ్రీ ఎమ్. కృష్ణ – సెక్రటరీ
శ్రీ ఇ. విజయ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ కె. నవీన్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ దేవరాజ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ పృథ్వీ – ఎగ్జిక్యూటివ్ మెంబర్

జనసేన పార్టీ తెలంగాణ యువజన విభాగం
శ్రీ వి. లక్ష్మణ్ గౌడ్ – ప్రెసిడెంట్
శ్రీ ఎన్. సురేష్ రెడ్డి – వైస్ ప్రెసిడెంట్
శ్రీ డి. సంతోష్ – వైస్ ప్రెసిడెంట్
శ్రీ ఎస్. కిరణ్ కుమార్ – జనరల్ సెక్రటరీ
శ్రీ ఎఫ్. సిద్ధూ – ఆర్గనైజింగ్ సెక్రటరీ
శ్రీ కె. సైదులు – ఆర్గనైజింగ్ సెక్రటరీ
శ్రీ యు. విజయ్ కుమార్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ &అధికార ప్రతినిధి
శ్రీ ఎం. హరీష్ గౌడ్ – సెక్రటరీ
శ్రీ డి. పవన్ – సెక్రటరీ
శ్రీ ఎం. మహబూబ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ బి. నరేష్ గౌడ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ ఎ. పవన్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ పి.పృధ్వీరాజ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ ఎస్.సాయికుమార్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
శ్రీ సిహెచ్.సాయిసాగర్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
జనసేన పార్టీ తెలంగాణ సాంస్కృతిక విభాగం కార్యదర్శి శ్రీ దుంపటి శ్రీనివాస్