Movies

వెంటిలేటర్ తీసేశారు

వెంటిలేటర్ తీసేశారు

సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి ఆయణ్ని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత తాజాగా స్పందించారు. `రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. త్వరగా కోలుకుంటున్నారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా కేరింగ్ తీసుకున్నారు. అందువల్ల రాజశేఖర్ గారు విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. రాజేశేఖర్ గారు వెంటిలేటర్ మీద ఉన్నారని ఓ వార్త ప్రచారం అవుతోంది. అది నిజం కాదు. ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరు. నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. అయితే వెంటిలేటర్ మీద మాత్రం లేరు. నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ గారు క్షేమంగా ఉన్నార`ని జీవిత పేర్కొన్నారు.