DailyDose

హైదరాబాద్‌లో యువతిపై అఘాయిత్యం…హత్య-నేరవార్తలు

హైదరాబాద్‌లో యువతిపై అఘాయిత్యం…హత్య-నేరవార్తలు

* సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివాహితపై యువకుల అఘాయిత్యం. కొల్లూరు తండాకు చెందిన తెలిసిన మహిళపై లైంగిక దాడి. స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయిన వివాహిత.

* డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ ‌డిపార్ట్‌మెంట్‌ గుంటూరు రీజియన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్‌ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. 1989 జనవరి 11న వరప్రసాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, 2018న డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో గుంటూరు, విజయవాడ సహా నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది.

* ఆరుగురు రాజధాని రైతులకు బెయిల్ మంజూరు – మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులకు హైకోర్టు బెయిల్ – ఆరుగురు రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లడంపై తీవ్ర దుమారం.

* దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు. కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

* దీపావళి సందర్భంగా జంటనగరాల్లో భారీ శబ్ధాలుచేసే బాణాసంచా కాల్చడం పై నిషేధం విధించినట్టు హైదరాబాద్‌పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

* టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి భూకుంభకోణంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సిట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టు  విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు దశలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటైందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.