Fashion

జపనీయుల యవ్వనానికి కారణం…

జపనీయుల యవ్వనానికి కారణం…

ఇటీవల జపాన్‌లో ఓ సర్వే నిర్వహించారు. అక్కడ యువతరమే ఎక్కువగా ఉన్నారని తేల్చారు. వయసు మళ్లినా వారిలో వృద్ధాప్య ఛాయలు రావడం లేదని సర్వేలో నిర్ధారించారు. ఆ సర్వే వివరాలు, జపాన్ యవ్వనత్వానికి కారణాలు ఇవే..జపాన్‌లో ముడతలు పడిన చర్మం ఉన్నవారు చాలా తక్కువ శాతం కనిపిస్తారు. ఇటీవల ఓ ఆరోగ్య సంస్థ జపాన్‌లో సర్వే నిర్వహించింది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం తదితర అంశాలపై సర్వే జరిగింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జపాన్ ప్రజలు కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారు. జపాన్ ప్రజల డైట్‌లో ఎక్కువగా గింజలు, ధాన్యాలు, కాయగూరలు, సముద్ర చేపలు, పాలు, పండ్లు ఉంటున్నాయి. హెర్బల్ టీ కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే.జపాన్ ప్రజలు అధికంగా కూరగాయలు తింటుంటారు. వీటిలో పోషకాలు ఎక్కువ. శరీరంలోని వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూరగాయలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి. బ్రకోలి, కాలీ ఫ్లవర్, మొలకలు, చైనీస్ క్యాబేజీ వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. జపాన్ ప్రజలు సముద్ర ఆహారం ఎక్కువగా తింటున్నారు. చేపల్ని బాగా తింటారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. ప్రతి రోజు ఉదయం లేచాక గ్లాసుడు నీళ్లు తాగుతారు. దాంతో కడుపులోని మలినాలు తొలగిపోతాయి. వాళ్ల డైట్ విధానం పాటిస్తే యాభైలలోకి అడుగుపెట్టినా యువకులుగానే ఉంటారని ఆ సంస్థ పేర్కొన్నది.