NRI-NRT

ట్రంప్ 2024లో పోటీ చేయవచ్చా?

ట్రంప్ 2024లో పోటీ చేయవచ్చా?

అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించే అవకాశం ఎవరికైనా కేవలం రెండుసార్లు మాత్రమే ఉంటుంది. ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు చాలా మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, అమెరికా రాజ్యాంగానికి 22వ సవరణ చేయడం ద్వారా.. ఎవరైనా రెండుసార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడయ్యేలా నిబంధనలు మార్చారు. ఇటీవలికాలంలో బిల్‌ క్లింటన్‌, జార్జ్‌బుష్‌ జూనియర్‌, ఒబామా.. రెండేసిసార్లు చొప్పున అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో జార్జ్‌ బుష్‌ సీనియర్‌.. రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. 28 సంవత్సరాల తర్వాత.. అదే కోవలో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమికి చేరువలో ఉన్నారు. ఆయన ఓటమి ఖరారైతే.. 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ పడొచ్చా? అంటే.. నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ఒకవేళ 2024లో ఆయన పోటీ చేసి గెలిస్తే అదే ఆఖరుసారి అవుతుంది. గతంలో అలా ఒక టర్మ్‌ విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన అధ్యక్షుడొకరు ఉన్నారు. ఆయన పేరు.. బెంజమిన్‌ హారిసన్‌. ఆయన 1885 నుంచి 1889 దాకా మొదటిసారి, 1893 నుంచి 1897 దాకా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఒకవేళ ట్రంప్‌ 2024లో పోటీ చేసి గెలిస్తే అదీ ఒక కొత్త చరిత్రే అవుతుంది.