Fashion

మేనోపాజ్ దశలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మేనోపాజ్ దశలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మహిళల్లో మెనోపాజ్‌ తెచ్చిపెట్టే సమస్యలెన్నో. ఈస్ట్రోజెన్‌ లోపం వల్ల కుంగుబాటు, చికాకు, నిద్రలేమి, మతిమరపు, దురదలు, గడ్డలు రావడం… ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి. అందుకే ఆ సమయంలో ఈస్ట్రోజెన్‌ శాతాన్ని పెంచే ఆహార పదార్థాల్ని తీసుకోవడంవల్ల వాటిని కొంతవరకూ అరికట్టవచ్చు అంటున్నారు పోషక నిపుణులు.
* నువ్వులు, అవిసెలు, పొద్దుతిరుగుడు తదితర విత్తనాల్లోని ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈస్ట్రోజెన్‌ శాతాన్ని పెంచుతాయి. దాంతో మానసికపరమైన సమస్యలు తగ్గుతాయి.
* పీచు ఎక్కువగా ఉండే పండ్లు తిన్నా మంచిదేనట. అలాగని మళ్లీ చక్కెరశాతం ఎక్కువగా ఉన్నవి అంత ఫలితాన్ని ఇవ్వవట.
* ఆకుకూరలతోపాటు బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటివి కూడా ఈస్ట్రోజెన్‌ శాతాన్ని పెంచుతాయి. ఇంకా సెనగలు, పప్పులు, పల్లీల్లోని ఫైటోఈస్ట్రోజెన్లు, ప్రొటీన్లు కూడా ఈస్ట్రోజెన్‌ శాతాన్ని పెంచేవే. సోయాలోని ఐసొఫ్లేవొనిన్లు సైతం రొమ్ముక్యాన్సర్లని రానివ్వవు. అక్రోట్లు మెదడుకి మేతలా పనిచేస్తూ చురుకుదనాన్నీ పెంచుతాయట. కాబట్టి ఆ సమయంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంది.