Sports

ట్రంప్ బాబాయి కామెడీ మిస్సవుతున్నాను

ట్రంప్ బాబాయి కామెడీ మిస్సవుతున్నాను

‘‘మా వాళ్లు అలాగే ఉన్నారు. ట్రంప్‌ బాబాయ్‌ కామెడీ మిస్‌ అవుతాం’’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. ఎన్నికల ఫలితం వెలువడటానికి గంట ముందు ట్రంప్ చేసిన ట్వీట్‌పై వసీమ్‌ జాఫర్‌ పంచ్‌‌ వేశాడు. ‘‘ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. భారీ విజయం’’ అని ట్రంప్‌ చేసిన ట్వీట్‌ను పోస్ట్‌ చేసి.. ‘‘ఈ సీజన్‌లో పంజాబ్‌ ట్రోఫీ గెలిచింది. భారీ విజయం’’ అని ట్వీటాడు. ప్రస్తుతం జరుగుతున్న 13వ సీజన్‌లో పంజాబ్‌ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ జట్టు ట్రోఫీని అందుకోలేదు. ఈ సీజన్‌లో పంజాబ్‌కు జాఫర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు.