DailyDose

జర్నలిస్ట్ దారుణ హత్య-నేరవార్తలు

జర్నలిస్ట్ దారుణ హత్య-నేరవార్తలు

* తమ గురించి బయట పెట్టాడని జర్నలిస్ట్ ని హత్యచేసిన స్మగ్లర్లు.తమిళ టీవి ఛానల్ రిపోర్టర్‌ మౌసన్‌ గంజాయ్ స్మగ్లర్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో ఈ ఘటన జరిగింది.మాట్లాడాలి.. ఇంటి నుంచి బయటకు రమ్మని చెప్పి దారుణంగా హత్య చేశారు స్మగ్లరు.ఇటీవల గంజాయ్ స్మగ్లింగ్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ కబ్జాలపై స్టింగ్ ఆపరేషన్ చేశాడు మౌసన్.దీంతో కక్ష కట్టిన స్మగ్లరు జర్మలిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు.అతని శరీరంపై 18 చోట్ల కత్తి పోట్లు ఉన్నాయ్. ప్రస్తుతం ముగ్గురు నిందితులు అదుపులో ఉన్నారు.

* GHMC ఎన్నికల నిర్వహణ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.గెలుపు కోసం టీఆరెస్ పార్టీ ఎన్నికల కమిషన్ తో కలిసి అక్రమాలకు పాల్పడుతూ ఓట్లను తారుమారు చేశారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ టీఆరెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోంది.హిందువుల ఓట్ల తగ్గించి ముస్లిం ల ఓట్లను పెంచింది.బీజేపీ ఇచ్చే అభ్యంతరాలను పరిశీలన చేయకుండా షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికలను అడ్డుకుంటాం.

* విశాఖలో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌.ఏటిఎం ప‌గ‌ల‌గొట్టేదుకు విశ్వ‌ప్ర‌య‌త్నం. అలారం మ్రోగ‌డంతో ప‌రారైన దొంగ‌లు.విశాఖలోని మదురవాడ మిధిలాపురి వుడా కాలనీలో దొంగలు హల్‌చల్ చేశారు. సెట్రల్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు.

* కడప :ఎర్రచందనం తమిళ కూలీల సజీవదహనం ఘటనపై ఎస్పీ మీడియా సమావేశం- అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ బాషాబాయ్‍ను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ- బాషాబాయ్ అసలు పేరు హకీమ్ అలీ అలియాస్ బాషాబాయ్- మరో 11 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ అన్బురాజన్- ఘటనలో మొత్తం 5 మంది సజీవదహనమయ్యారు- కేసు దర్యాప్తునకు ఐదు బృందాలు పనిచేశాయి- సైబర్ టీమ్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు నిందితులను పట్టుకోగలిగాం

* అగ్రిగోల్డ్‌ కేసు విషయంలో ₹20వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

* నెల్లూరు జిల్లా , ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకల్లో తెలుగుదేశం నాయకులే ప్రధాన ముద్దాయిలుగా పోలీసు విచారణలో తేలింది.

* తిరుమలలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.తితిదే పాలకమండలికి చెందిన ఓ సభ్యుడి పేరును నిందితులు వాడుకున్నట్టు విచారణలో తేలింది.ఆయన పేరు చెప్పే కొండపైకి వచ్చారని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు.అప్పుగా ఇచ్చిన రూ. 20 లక్షలు వసూలు కోసమే బాధితుణ్ని అపహరించాలని పథకం వేసినట్టు పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంవాసి హనుమంతరావు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శ్రీనివాస్ వద్ద రూ.20 లక్షల రుణం తీసుకున్నారు.లాక్ డౌన్ కారణంగా వాటిని తిరిగి ఇవ్వలేకపోయాడు.ఆ డబ్బు వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నించిన శ్రీనివాస్ చివరకు కిడ్నాప్ చేయడానికి యత్నించాడు.కుటుంబంతో తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి హనుమంతరావు వెళ్లాడని తెలుసుకున్న శ్రీనివాస్… అక్కడే కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు.కొంతమందిని పురమాయించి తిరుమలలో ఆయన్ని అపహరించే ప్రయత్నం ఆదివారం చేశారు.బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఘాట్ కిందికి దిగేలోపు నిందితులను అరెస్టు చేశారు.నిందితులు కొండపైకి ఎలా వచ్చారన్న ప్రశ్నకు తితిదే పాలకమండలి సభ్యుడి కోటాలో టిక్కెట్లున్నాయని వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు పోలీసులు.నిందితులను రిమాండ్​కి తరలిస్తున్నట్లు తెలిపిన ఏఎస్పీ పూర్తి వివరాలను విచారణ పూర్తి చేసిన అనంతరం వెల్లడిస్తామన్నారు.ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి 20 నిమిషాల్లోపే నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సహకరించిన రక్షక్ కానిస్టేబుళ్లకు ఏఎస్పీ రివార్డు అందజేశారు.

* పార్వతీపురంలోని అమ్మిగారికోనేరు సమీపంలోని పూరిళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి 2గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

* భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోడాపై దిల్లీకి చెందిన న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.