Politics

రేపే దుబ్బాక ఫలితం

రేపే దుబ్బాక ఫలితం

రేపు దుబ్బాక ఫలితం

ఒక్క రోజే..కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

అభ్యర్థుల్లో సడలని ధీమా

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ

సిద్దిపేట ఇందూరు కాలేజీ వద్ద బందోబస్తు

14 టేబుళ్లు.. 23 రౌండ్లలో లెక్కింపు

ఉదయం 8.30 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం

మధ్యాహ్నం కల్లా గెలుపోటములపై స్పష్టత

కౌంట్‌డౌన్‌ స్టార్టయ్యింది.. కోట్లాది మంది ఎదురు చూస్తున్న దుబ్బాక ఫలితానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది.

. రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. అందరి చూపు ఇటువైపే మళ్లింది.

ఈ నెల 3వ తేదీన పోలింగ్‌ జరుగగా ఈనెల 10న అంటే మంగళవారం అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలను ఓపెన్‌ చేస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపోటములపై స్పష్టత ఏర్పడుతుంది.

14 టేబుళ్లు.. 23 రౌండ్లు

కౌంటింగ్‌లో భాగంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టేబుళ్లపై 23 రౌండ్లపాటు ఈవీఎంలను లెక్కిస్తారు.

దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్‌ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి.

ఈవీఎంలను ఓపెన్‌ చేయడం, వాటిని లెక్కించడం త్వరత్వరగానే పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు.

అదే విధంగా 1,453 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 51 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. వీటిని ముందుగానే లెక్కించనున్నారు.