NRI-NRT

నన్ను ఇంత మోసం చేస్తారా?

నన్ను ఇంత మోసం చేస్తారా?

కోవిడ్‌ నివారణ కోసం ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందన్న విషయాన్ని ఫైజర్‌, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), సంస్థలు ​కావాలనే దాచిపెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. తన గెలుపును అడ్డుకునేందుకే ఈ రెండు సంస్థలు టీకా అభివృద్ధిపై ప్రకటనను నిలిపివేసిందన్నారు. కావాలనే  ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు రోజుల అనంతరం వ్యాక్సిన్‌పై అప్‌డేట్‌ వచ్చిందని, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని ట్రం‍ప్‌ పేర్కొన్నారు. ఒకవేళ జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉంటే వ్యాక్సిన్‌ వచ్చి ఉండేది కాదని, ఎఫ్‌డిఎ సైతం ఇంత త్వరగా ఆమోదించి ఉండేది కాదని, ఫలితంగా లక్షలమంది ప్రాణాలు పోయేవని ట్రంప్‌ అన్నారు. ఫైజర్‌ సంస్థ ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్‌పై ప్రకటన చేస్తారని తాను గతంలోనే చెప్పానని, ఎందుకంటే వారికి అంత ధైర్యం లేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్‌పై ఎఫ్‌డిఎ ముందే ప్రకటన చేసి ఉండాల్సింది అంటూ ట్రం‍ప్‌ ట్వీట్‌ చేశారు.