NRI-NRT

ఇది ముస్లిం దేశంలో హిందూ ఆలయం నమూనా!

Abu Dhabi Hindu Temple Design Is Here

యూఏఈలోని అబూదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయ ఆకృతులను ఆలయ నిర్వాహకులు వీడియో రూపంలో విడుదల చేశారు. భారత ఇతిహాసాలు, గ్రంథాలు, పురాతన గాధలతో ఆలయ గోడలు అలరారనున్నాయని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ భారీ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. డిసెంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం నిర్మిస్తున్న ‘ఆధ్యాత్మిక ఒయాసిస్సు’గా ఈ ఆలయాన్ని నిర్వాహకులు పేర్కొన్నారు.