Movies

తనూ రిటర్న్స్

తనూ రిటర్న్స్

వ్యక్తిగత కారణాల వల్ల 2010లో సినిమాలకు దూరమయ్యారు బాలీవుడ్‌ హాట్‌బ్యూటీ తనుశ్రీ దత్తా. లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్న ఆమె తాజాగా.. బాలీవుడ్‌ రీఎంట్రీపై అభిమానులకు శుభవార్త చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ చేశారు. ‘‘చాలాకాలంగా ఆమెరికాలో రక్షణ విబాగంలో ఐటీ ఉద్యోగం చేస్తున్నా. ఎంతో గౌరవమైన ఉద్యోగం అది. అలాంటి ఉద్యోగాన్ని ఎవరూ వదులుకోవాలనుకోరు. కానీ, నేను మళ్లీ సినిమాల మీద దృష్టిపెట్టాలనుకుంటున్నా.
బాలీవుడ్‌లో నాకున్న పేరుకు ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందులో వెబ్‌ సిరీ్‌సలూ ఉన్నాయి. ఇన్నాళ్లూ రీఎంట్రీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోయా. ఇప్పుడు సినిమాల కోసం 15 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా తయారయ్యా’’ అని పేర్కొన్నారు.