DailyDose

SVBCలో పోర్న్ లింకుల కలకలం-నేరవార్తలు

SVBCలో పోర్న్ లింకుల కలకలం-నేరవార్తలు

* శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పోర్న్‌ సైట్‌ లింక్‌ కలకలం రేపింది. ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్‌ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్‌ పంపించాడు. దీంతో ఈ ఘటనపై ఆ భక్తుడు టీటీడీ చైర్మన్‌, ఈవోకి ఫిర్యాదు చేశాడు.మరోవైపు ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోర్న్‌సైట్‌ వీడియో పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది. 

* వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బుధవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రికార్డులను సీబీఐకు వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌కు ఆదేశించింది. వివేకా హత్యకు సంబంధించి తమకు రికార్డులు ఇవ్వాలని సీబీఐ అధికారుల బృందం పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, రికార్డులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో.. సీబీఐ బృందం రాష్ట్ర హైకోర్టులో 15 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది

* అనంతపురం జిల్లా అగళి పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.65,630/- నగదు స్వాధీనం చేసుకున్నారు.

* అర్నాబ్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని, అతనితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది.రూ.50,000 పూచీకత్తు కింద మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని సుప్రీం ఆదేశించింది.బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన అర్నాబ్‌కు తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది.

* వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త తండా శివారులో గుర్తు తెలియని ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది.పత్తి చెను కౌల్ చేస్తున్న రైతు కతలప్ప పొలంలో ఈ ఘటన వెలుగుచూసింది.ఆ కౌల్ రైతు పోలీసులు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి జగిలాలతో చేరుకున్నారు. Dsp కిరణ్ కుమార్ కథనం మేరకు ఓ గుర్తు తెలియని 18నుండి 25 సంత్సరాల మధ్య గల యువతిని వారం రోజుల క్రితం హతమార్చినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఈ యువతి శరీరంపై బ్లూ కలర్ జీన్స్ పాయింట్ మాత్రమే ఉన్న అనవాలను బట్టి ఈమెను పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్లో ఏవైనా మిస్సింగ్ కేసులు నమోదు అయ్యవని సమాచారాన్ని సేకరిస్తున్నామని అన్నారు.

* గౌరవరం గ్రామంలో నందిగామ నుండి జగ్గయ్యపేట వచ్చే హైవే రోడ్ లో గౌరవరం ఊరు ముందు సర్వీస్ రోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొనగా అందరూ క్షతగాత్రులయ్యారు.