ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎస్‌డీ శిబులాల్ 4 లక్షలకు పైగా కంపెనీ షేర్లను బహుమతిగా అందుకున్నారు. వీటితో కలిపి ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న మొత్తం ఇన్ఫోసిస్ షేర్ల సంఖ్య 21.6 లక్షలు దాటింది. ఈ నెల 12న ఆఫ్ మార్కెట్ లావాదేవీలో 4,01,000 (0.01 శాతం) ఈక్విటీ షేర్లు శిబులాల్‌కు బహుమతిగా ఇచ్చినట్లు ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అయితే ఈ షేర్లను ఎవరు బహుమతిగా ఇచ్చారన్న విషయాన్ని వెల్లడించలేదు. ఇక శిబులాల్ భార్య కుమారి 4.01 లక్షల షేర్లను అదే రోజు బహుమతిగా ఇచ్చినట్లు ఉన్నా,. గ్రహీత వివరాలను కంపెనీ బయటపెట్టలేదు. ఇన్ఫోసిస్‌లో కుమారి వాటా 0.21 శాతానికి తగ్గగా, శిబులాల్ వాటా 0.05 శాతానికి పెరిగింది. ఈ లావాదేవీ తర్వాత కుమారి వద్ద 88,96,930 ఇన్ఫోసిస్ షేర్లు, శిబులాల్ దగ్గర 21,66,768 షేర్లు ఉన్నాయి.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడికి లక్షల షేర్ల బహుమతి
Related tags :