Fashion

చలికాలం ఎలాంటి సబ్బులు వాడాలి?

చలికాలం ఎలాంటి సబ్బులు వాడాలి?

చలికాలంలో ఎక్కువగా చర్మ సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఎక్కువగా లోషన్లు వాడుతూ ఉండాలి. పూల రసాలతో తయారైన లోషన్స్ వాడడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే ఈ సమయంలో సూర్య కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్ బేస్డ్ లోషన్స్, ఇందులోనూ గులాబీ, మల్లె, మందారం వంటి వాటితో తయారైన లోషన్లు వాడితే మంచిది.చలికాలంలో చర్మానికి ఎక్కువ పోషణ అవసరం. అందుకే గ్లిజరిన్, రోజ్‌వాటర్‌ను వాడడం మంచిది. వీటితో తయారైన సబ్బులు, ఫేస్‌వాష్‌లు వాడడం మంచిది. దీనివల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది.వారానికి ఒకసారి సున్నిపిండిని వాడడం మంచిది. వీటితో పాటు బేబీ సోప్ వాడినా చక్కని ఫలితం ఉంటుంది. నూనెతో ఒళ్లంతా మర్దన చేసి ఆ తర్వాత స్నానం చేసినా కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది.చలికాలంలో మెరిసే చర్మం కావాలనుకునే వారు కేవలం లోషన్స్, సోప్స్ మీదే ఆధారపడితే కుదరదు. డైట్‌లో పోషకాలున్న ఆహారపదార్థాలు చేర్చుకోవాలి. పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటూ ఉండాలి.చలికాలంలో విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు తీసుకోవడం మంచిది. ద్రాక్ష పండ్లలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా వీటిని తినడం చాలా మంచిది. వీటిలోని లైకోపిన్ చర్మాన్ని అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడి మృదువుగా మారుస్తుంది.