Politics

వెంకయ్యను అలరింపజేసిన గుమ్మడి

వెంకయ్యను అలరింపజేసిన గుమ్మడి

తెలుగు పద్యమంత మనోజ్ఞమైనది, మధురమైనది, సుందరమైనది మరే భాషలో లేదనడం అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదనానికి ప్రతీక తెలుగు పద్యం. అలాంటి తెలుగు పద్యాన్ని కాపాడుకుని, ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నంలో మన పద్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఆవశ్యకమని తెలిపారు. రామాయణ, మహాభారతాలు సహా మన పురాణేతి హాసాలను మన పెద్దలు పద్యనాటకాల ద్వారా ప్రాచుర్యం చేశారు. పద్యంలో చక్కని పదబంధం, సాహిత్యం, మాధుర్యంతోపాటు సందేశం కూడా ఇమిడి ఉంటుంది. అది మనసును రంజింపజేస్తుంది. తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పద్యాన్ని మరింత విస్తృతం చేయడంలో ప్రచార, ప్రసార సాధనాలు కృషిచేయాలి చెపారు. దీపావళి సందర్భంగా తెలుగు పద్య నాటక ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ తో హైదరాబాద్ లో సాహిత్య గోష్ఠి జరిగింది. మన పద్యం, మన సాహిత్యం గురించి కాసేపు చర్చించుకున్నాము. పండుగరోజు సత్కాలక్షేపం చేయడం సంతోషం కలిగించిందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలో మేలి ముత్యాల్లాంటి పద్యాలను గోపాలకృష్ణ ఆలపించారు. అల్లసాని పెద్దన, శ్రీనాథుడు రచించిన పద్యాలతోపాటు పలు పురాణ ఘట్టాలను వివరిస్తూ రాగయుక్తంగా, భావయుక్తంగా ఆలపించిన తీరు ఆనందింపజేసిందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
వెంకయ్యను అలరింపజేసిన గుమ్మడి