Food

ఒత్తిడిని చిత్తు చేసే బిరియానీ ఆకు

Telugu Food News - Biryani Leaf Bay Leaves Helps Fighting Stress

ఒత్తిడి తొలగి మనసు తేలికగా మారాలంటే సువాసనతో నిండిన పరిసరాల్లో గడపాలని అంటారు. ఇందుకోసం సుగంధద్రవ్యమైన బిరియానీ ఆకునూ ఉపయోగించవచ్చు. బిరియానీ ఆకులో ఒత్తిడిని తొలగించే గుణాలు ఉంటాయి. తులసి ఆకుల్లో ఉండే ‘లినలూల్‌’ ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను నెమ్మదించేలా చేస్తుంది. కాబట్టే ఆరోమాథెరపీలో భాగంగా ఈ కాంపౌండ్‌ను వాడుతూ ఉంటారు. కాబట్టి ఒత్తిడిగా అనిపిస్తే బిరియానీ ఆకును కాల్చి, వాసన పీల్చాలి. ఇందుకోసం పచ్చి ఆకుల బదులుగా బాగా ఎండిన ఆకులను ఎంచుకోవాలి. గది తలుపులు మూసి, ఓ గిన్నెలో బిరియానీ ఆకును తుంచి వేసి, మండించాలి. ఆకులు కాలడంతో పల్చని పొగతో పాటు, సువాసన గది మొత్తం అలముకుంటుంది. ఈ వాసనను పీల్చడం వల్ల మనసు నెమ్మదించి, ఒత్తిడి తొలగిపోతుంది.