DailyDose

డీఎస్పీ సీఐల సస్పెన్షన్-నేరవార్తలు

డీఎస్పీ సీఐల సస్పెన్షన్-నేరవార్తలు

* గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్​ను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సస్పెన్షన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పలు కేసుల విచారణలో అలక్ష్యంగా వ్యవహరించటం ఇద్దరి సస్పెన్షన్​కు కారణమని పోలీసువర్గాలు చెబుతున్నా అంతర్గతంగా రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని సదరు ప్రజాప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఇద్దరిపైనా వేటు వేసినట్టు భావిస్తున్నారు.

* వనస్థలిపురంలో ఏటీఎం లో భారీ చోరీ.ఏటీఎం ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన దుండగులు..ఏటీఎం మిషన్ లో ఉన్న నగదు మొత్తం అపహరణ..మిషన్ తో పూర్తిగా కట్ చేసి నగదు చోరీ చేసిన దుండగులు ..సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ పోలీసులు..దుండగుల కోసం నాలుగు టీమ్స్ ను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్.

* విశాఖ…గాజువాక…యారడాలో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం.యారడా తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు.ఆదివారం ఆటవిడుపుగా యారడాకు వచ్చిన ఏడుగురు యువకులు.అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్ళల్లో చిక్కుకున్న యువకులు.నగరానికి చెందిన కొండ నవీన్(20), భీశెట్టి యశ్వంత్(20), కె.శ్రవణ్(20).మిగిలిన మిత్రుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు.

* జిల్లా కలెక్టర్‌పై హత్యానేరం కేసు నమోదైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. హత్యా నేరం, సాక్ష్యాలను నాశనం చేసినందుకు మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌, సంబంధిత సిబ్బందిపై కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) దేబ్‌ నారాయణ్‌ పండా మృతికి సంబంధించి కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌, మరో ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలో కాల్పులు కలకలం రేపాయి. గోవిందాపూర్‌ శివారులో 30 ఎకరాల భూ వివాదం వ్యవహారంలో ఒక వర్గంపై మరో వర్గానికి చెందిన వ్యక్తి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. చిరాగ్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.