NRI-NRT

ముగిసిన తానా బాలోత్సవం 2020

ముగిసిన తానా బాలోత్సవం 2020-Online TANA Balotsavam 2020 Concludes With 66 Winners

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించిన “బాలోత్సవం-2020” వేడుకలు బాలల దినోత్సవం నాడు ముగిశాయి. తానా అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ ముగింపు ఉపన్యాసంతో ఈ వేడుక ప్రారంభమైంది. ‘వకారపంచకం’ విశిష్టతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమ రూపకర్త డా.వాసిరెడ్డి రమేష్‌బాబు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, డా.జంపాల చౌదరి, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరిలు ప్రసంగించారు. భారతదేశం నుండి సినీ, సాంస్కృతిక, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కొరటాల శివ, నాగ్ అశ్విన్, రామజోగయ్య శాస్త్రి, శోభారాజు, కూచిపూడి గురువు కె.వి.ఎస్.సత్యనారాయణ, కుచిపూడి కళాకారిణి జ్యోతి రెడ్డి, హిమాన్సీ కాట్రగడ్డ, గాయకుడు శ్రీ కృష్ణ, గ్రాండ్ మాష్టర్ పెండ్యాల హరికృష్ణలు చిన్నారులకు తమ సందేశాలను అందజేశారు.
ముగిసిన తానా బాలోత్సవం 2020-Online TANA Balotsavam 2020 Concludes With 66 Winners
ఆద్యంతం అంతర్జాలంలో నిర్వహించిన ఈ బాలోత్సవంలో ఉత్తర అమెరికా నుండి 2400 మంది చిన్నారులు, శాస్త్రీయ సంగీతం, తెలుగు పద్యాలు, సినీ నృత్యాలు, సినీ గీతాలు, దేశభక్తి రూపాలు, చిత్రలేఖనం, చదరంగం తదితర 11 రకాల విభాగాల్లో ద్వివయో విభాగాల వారీగా(5-10, 11-16 సం||) పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. వీరిలో 66మంది విజేతలను ముగింపు వేడుకల్లో ప్రకటించారు. అంతర్జాలంలో విజయవంతంగా తానా బాలోత్సవాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులు రేఖా ఉప్పలూరి, సునీల్ పాంత్రా, రాజా కసుకుర్తి, సుమంత్ రామిశెట్టి, శ్రీని యలవర్తిలను అధ్యక్షుడు జయశేఖర్ అభినందించారు.
ముగిసిన తానా బాలోత్సవం 2020-Online TANA Balotsavam 2020 Concludes With 66 Winners