DailyDose

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత-నేరవార్తలు

Crime News - Hyderabad Drugs Captured

* రాజధానిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత మరోసారి కలకలం రేపింది. గోవా నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సల్మాన్‌తో పాటు హైమద్‌ అనే వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.  సల్మాన్ ద్వారా పది పబ్ లకు డ్రగ్స్  సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. డ్రగ్స్‌ను  సరఫరా చేస్తున్న పబ్స్ డాటాను పోలీసులు బయటకు  తీసే ప్రయత్నం చేస్తున్నారు.

* విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో జరిగిన విచారణ.ఈనెల 10 న సీల్డ్ కవర్ లో రెండవ రిపోర్ట్ అంధించామన్న సీబీఐ.కేసు వివరాలు తెలియజేయాలన్న హైకోర్టు.కేసు సున్నితమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్టులో బహిర్గతం చేయలేమన్న సిబీఐ పిపి.సీల్డ్ కవర్ ను తమముందు ఉ0చాలన్న ధర్మాసనం.మధ్యాహ్నం 2.30 గంటలకు మరోమారు విచారణ చేపట్టనున్న హైకోర్టు.

* గుంటూరు సత్తెనపల్లి నిర్మల నగర్ లో బాలుడి కిడ్నాప్.నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాలుడు వినయ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు.పోలీసులు కు చెబితే చంపెస్తామంటూ ఫోన్ కాల్స్.రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్.పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.వినయ్ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు ప్రత్యేక బృందాలు.

* 336వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు ధ్వజం. వెలగపూడి, మందడం, దొండపాడు, తుళ్లూరు : రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైసీపీ నేతలు అధికారం చేపట్టినట్లుగా ఉందని రాజధాని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా నంద్యాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్​రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.