DailyDose

కోర్టులో జరిమానా చెల్లించిన శశికళ-నేరవార్తలు

Sasikala Pays 10 Crores Fine In Court - Crime News

* అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే మాజీ కార్యదర్శి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ చెల్లించారు.ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ తరఫున ఆమె న్యాయవాదులు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు.ఈ మొత్తాన్ని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా అందజేసినట్లు తెలుస్తోంది.ఈ మొత్తాన్ని ఓ రాజకీయ నేత ఏర్పాటు చేసినట్లు సమాచారం.అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేసే అవకాశం ఉందని కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.ఈ కేసులో శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు.ఇందులో జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా ఇతరులకు రూ.10 కోట్లు జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్​లో ట్రయల్​ కోర్టు తీర్పునిచ్చింది.

* ఈరోజు ఉదయం జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్ పేరుమీద రాజస్థాన్ కు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి కొంతమందికి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించి వారిని అత్యవసరమని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. ఇది తెలుసుకున్న వెంటనే సి ఐ తన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ నకిలీ ఫేస్బుక్ ఖాతా గురించి తెలియజేసి ఎవరిని కూడా ఎవరు డబ్బులు వేయవద్దని కోరారు.

* సీనియర్ సిటిజన్ల దర్శనంపై సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారం.సీనియర్ సిటిజన్లకు తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు స్లాట్లు కేటాయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం వాస్తవం కాదు.కోవిడ్ 19 నిబంధనల మేరకు 10 ఏళ్ల లోపు పిల్లలను, 65 ఏళ్ళు దాటిన వారిని శ్రీ వారి దర్శనానికి అనుమతించడం లేదు.సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారాన్ని భక్తులు విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

* దివ్య హత్యకేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.రాజమండ్రి జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.ఈనెల 20 వరకు పోలీస్‌ కస్టడీలో నిందితుడు నాగేంద్రబాబు ఉన్నాడు.దివ్య హత్యకు జరిగిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. 

* ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ లో టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేసిన ముషీరాబాద్ బీజేపీ కార్యకర్తలు.

* తండ్రి విగ్రహం పెట్టేందుకే మంత్రి అనిల్‌ను సీఎం పోలవరం పంపారు.పోలవరంలో 125 అడుగుల వైఎస్ విగ్రహం పెట్టేందుకు సిద్ధమయ్యారు.రూ.254 కోట్లతో పోలవరంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తారా ?వరదల్లో మంచినీటి ప్యాకెట్లు ఇవ్వకుండా.. విగ్రహాలు పెడతారా ?నిర్వాసితులను గాలికి వదిలేశారు. సర్వే రాళ్లపై సీఎం బొమ్మలను వేస్తున్న ప్రభుత్వం ఎటు వెళ్తోంది.—మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

* పూతలపట్టు, నాయుడుపేట హైవే రోడ్డుపై నెలబల్లి క్రాస్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పవన్ (35 ) బాలకృష్ణ (28) లు నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

* తమిళ నటి, బీజేపీ నేత ఖుష్బూ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఆమె ప్రయాణిస్తున్న కారు మెల్వార్‌వతూర్‌ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది.కారును ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్‌ పూర్తిగా ధ్వంసమైంది.అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.మరి కొంతమందితో కలిసి వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

* హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ఎన్నికల కమిషన్‍కు ప్రభుత్వం సహకరించడం లేదుహైకోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పాం.హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం.. ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.దీనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు హైకోర్టుకు వెళ్లాలని ఎస్‍ఈసీ నిర్ణయం.

* పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసులో ప్రతివాదిగా ఎస్‌ఐని చేర్చేందుకు హైకోర్టు అనుమతించింది.పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.ఎస్‌ఐని ప్రతివాదిగా చేర్చాలని మధ్యంతర పిటిషన్‌ను పిటిషనర్ దాఖలు చేశారు.ఎస్‌ఐని ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతిస్తూ హైకోర్టు కేసు విచారణను 26కు వాయిదా వేసింది. 

* జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది బాంబే హైకోర్టు.చికిత్స నిమిత్తం 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని ఆదేశించింది.దీనికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది.ఆసుపత్రి నిబంధనల మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసేందుకు అగీకారం తెలిపింది కోర్టు.వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని, చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య హేమలత దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

* ఎంపీగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది.ఎంపీగా మోదీ ఎన్నికను సవాలు చేస్తూ మాజీ బీఎస్​ఎఫ్​ అధికారి తేజ్ బహుదూర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.2019 ఎన్నికల్లో పలు ఒత్తిళ్లతో తన నామినేషన్‌ తిరస్కరించారని తెలిపారు.ఆధారాల సమర్పణకు తెజ్‌బహుదూర్‌ తరఫు న్యాయవాది గడువు కోరారు.అయితే విచారణ వాయిదా వేసేందుకు తిరస్కరించిన జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్​‌ చేసింది.

* ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందారు.ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​ జిల్లాలో జవాఈన్​-పసనా ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.