Fashion

గోవును ఎందుకు పూజించాలి?

Why should you pray to cows - Hindus and cows - Telugu lifestyle

**గోవును దేవతగా పూజించడం భారతీయ (హిందువులు) సనాతన ధర్మం! ‘గంగి గోవుపాలు గరిటెడైనను చాలు’ అని వేమన ఊరికే అనలేదు! ఆవు పంచితం, పాలు ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పుడంటున్నారుగానీ, అదెప్పుడో రుజువైంది! మనపాలిట నిజంగా అది కామ‘ధేనువే’! ఇప్పుడీ విషయా న్ని అమెరికా పరిశోధకులు ‘శాసీ్త్రయంగా’ నిరూపించారు. అచ్చం ఆవు యాంటీబాడీల్లాగే పనిచేసే ఓ కొత్త యాంటీబాడీని ది స్ర్కిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాంటీబాడీలను మానవ హార్మోన్లతో జతచేయడం ద్వారా సత్ఫలితాలొచ్చాయని వివరించారు. ఈ హార్మోన్‌ సమస్యలే కాదు.. భవిష్యత్తులో ఇతర జబ్బుల చికిత్సకు ఇది మార్గం సుగమం చేస్తుందని పరిశోధకుడు టావో ల్యూ ధీమా వ్యక్తంచేశారు. ఇది మహిళల్లో ఎదుగుదల సమస్యకు, ఇతరత్రా హార్మోన్‌ సమస్యలకు చెక్‌పెడుతుందని చెబుతున్నారు. సాధారణంగా గ్రోత్‌ హార్మోన్‌ (హెచ్‌జీహెచ్‌) ప్రభావం శరీరంలో 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వారు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుండడం వల్లే దీనిని రూపొందించామని ల్యూ చెబుతున్నారు. గోవు యాంటీబాడీలపై పరిశోధనల ఫలితాలే ప్రేరణనిచ్చాయన్నారు. దాని నిర్మాణం అసమానమని, ప్రత్యేకమైనదని అంటున్నారు. ఏదో ఓ రోజు ఈ కృత్రిమ అణువు మానవుడి వివిధ చికిత్సలకు కీలకంగా మారుతుంది.
*ఋగ్వేద కాలం నుంచి ఆవు పవిత్రమైన జంతువు. అప్పటినుంచి ఆవును గో మాతగా పిలుస్తూ భారతీయులు గోవును పూజిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు హిందూ మతంలో గోబలి ఉండేది.దాని కారణంగా గోవు పవిత్రమైనదని అదనని వదిన్చాకుడదని సాగిన ఉద్యమ నేపద్యంలో దానికి బదులు గుర్రంను బలి ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో గుర్రం కూడ ముక్యమైన జంతువు కావడంతో దాన్ని బలి ఇవ్వకుదడనే నిర్ణయం చేసి దానికి బదులు మేకను బలి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పటికి మేక బలి సాగుతూనే ఉంది. ఈ విషయమ్ పక్కన పెడితే ఒకప్పుడు భారతీయ యువతికి వివాహం అయినతర్వాత అత్తగారింటికి తొలిగా కాపురానికి వెళుతున్నప్పుడు ముందు గోవును నట్టింట నడిపిస్తున్నారు. ఆవు పాలు కావాలంటే ఉచితంగానే ఇచ్చేవారు. ఇప్పుడు ఖరీదైన దొరికే పరిస్థితి లేదు. అయితే డిపార్టుమెంటు స్టోర్స్లో పలు డైరీల పేరుతొ ప్యాకెట్లు లభిస్తున్నయి. అత్యధికంగా ఆవుల పెంపకాలు ఉండే రోజులు పోయి గృహప్రవేశాలు, షాపులు ప్రారంభోత్సవాలు, పూజా సమయంలో మాత్రం ఏదో ఒక అఆవును తీసుకు వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయ ఉద్యమ నేత పాలేకర్ వచ్చిన తరువాత పశు ఎరువు వాడకం ద్వారా కలుషితంలేని వ్యవసాయానికి ప్రాదాన్యత సంతరించుకుంటుంది. పల్లెల్లో కాకుండా పట్టణాల్లో నివశాల వద్ద ఈ సేంద్రియ ఎరువుల వినియోగంతో మొక్కల పెంపకాలు సాగిస్తున్నారు.