Politics

మాట మార్చిన పవన్-GHMC ఎన్నికలపై TNI బులెటిన్

Pawan Kalyan Withdraws From GHMC Contest - Now Supports BJP

* హైదరాబాద్‌ ప్రజల రక్షణకు బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా సీనియర్‌ నేత లక్ష్మణ్‌ హైదరాబాద్‌లోని నాదెండ్ల మనోహర్‌ నివాసంలో పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని, భాజపాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. రెండు పార్టీలు కలిసే పోటీచేయాలని అనుకున్నా కరోనా పరిస్థితులు, అనూహ్యంగా వచ్చిన ఎన్నికలతో సాధ్యం కాలేదన్నారు. జనసేన కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దని అన్నారు. తాజా ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరముందని, ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాకు జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని భాజపా, జనసేన నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

* వెంగల్‌ రావు నగర్‌ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, రామచంద్రాపురం కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌లు బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌నుంచి టికెట్‌ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కిలారి మనోహర్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూపులో అభ్యంతరకర వీడియోలు పెట్టి అప్పట్లో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. కేం‍ద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆయనకు వెంగల్‌ రావు నగర్‌​ బీజేపీ టికెట్‌ ఖరారు చేశారు.

* బీజేపీలోకి వెంగళరావు నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ కిలారి మనోహర్.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న మనోహర్.వెంగళరావు నగర్ బీజేపీ అభ్యర్థిగా కిలారి మనోహర్.

* అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ లకు చెందిన టృశ్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ ల నామినేషన్ ర్యాలీ లో పాల్గొన్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.

* వరద సాయం లేఖపై సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మధ్యాహ్నం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లేఖ రాస్తే వరద సాయం ఆపారని ప్రచారం చేశారని, సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేవిధంగా సీఎం స్థాయి దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీని బూచిగా చూపుతున్నారని ఆరోపించారు. తన సవాల్‌ను స్వీకరించకుండా సీఎం కేసీఆర్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు.

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్‌ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి. అధికార టీఆర్‌ఎస్‌ 25 మంది తన చివరి జాబితాను విడదల చేయగా.. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవిని చర్లపల్లి డివిజన్‌ నుంచి బరిలో దింపారు. బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు భారీ కసరత్తు చేశాయి. పార్టీ శ్రేణులు టికెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్‌ దక్కనివారిని చేరదీస్తున్నాయి.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మన్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నామినేషన్‌ గడువు ముగిసింది. మూడు రోజుల పాటు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల చివరిరోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్ల కార్యాలయాలు కిటకిటలాడాయి.

* కేసీఆర్ ఇస్తున్న 2016 రూ. పెన్షన్ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇస్తున్నాడా..?కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు.ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర పన్నుతోంది బీజేపీ.యువనాయకుడు కేటిఆర్ మోకాళ్ల లోతు నీటిలో తిరుగుతూ వరద బాధితులకు అండగా నిలబడ్డాడు.పేద ప్రజలకు ఇచ్చే సహాయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీ అడ్డుకున్నాయి.ప్రతిపక్షాలకు కావాల్సింది కేవలం రాజకీయమే.. ప్రజల సంక్షేమం కాదు.మాట ఇస్తే..తప్పని పార్టీ టిఆర్ఎస్.కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి.జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

* మంత్రి కే టీ రామారావు @ హైదరాబాద్ ప్రగతి నివేదిక విడుదల ,తెలంగాణ భవన్…మాటల్లో కాదు చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించాం..ghmc ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు అందుకు నిదర్శనం..మహిళలకు 75 సీట్లు ఇవ్వాల్సివుండగా 85 సీట్లు ఇచ్చి మహిళా పక్షపాతి నని టీ ఆర్ ఎస్ చాటుకుంది…17 సీట్లు మైనారిటీలకు ,ఎస్టీలకు 3 ,ఎస్సే లకు పదమూడు సీట్లు కేటాయించాము ….అగ్రవర్ణాల్లో అందరికీ న్యాయం చేశాం…హైదరాబాద్ లో తెలంగాణేతరులకు ఏమవుతుందో అనే తెలంగాణ వచ్చిన కొత్తలో భయాలు ఉండేవి…సీఎం కెసిఆర్ వాటినన్నిటిని పటాపంచలు చేసారు…ఈ ఎన్నికల్లో 8 మందికి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరపడ్డవారికి టిక్కెట్లు ఇచ్చాము…టికెట్లు వచ్చిన వారు పార్టీ లోని అందరినీ కలుపుకుని పోవాలి…గర్వం ,అహం పనికి రాదు…పార్టీ లో మీతో పోటీ పడ్డ వారి ఇండ్లకు వెళ్లిమొదట వారి ఆశీర్వాదం తీసుకోండి…ఓట్లు లేవని ఎవ్వరినీ లైట్ గా తీసుకోవద్దు…ప్రగతి నివేదిక నే మన అభ్యర్థులకు ప్రచారాస్త్రం…ఎం చేశామో చెప్పుకోవాలి…రేపు ఉదయమే బీ ఫారం లు సమర్పించాలి..నాది కూడా హైదరాబాద్ కాదు ..ఇక్కడ పుట్టలేదు ..స్థిరపడ్డాం…ఎవరైనా హైదరాబాద్ లో సురక్షితంగా ఉండవచ్చు…95 శాతం నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి…హైదరాబాద్ కు 2050 వరకు తాగునీటి ఎద్దడి లేకుండా సీఎం కెసిఆర్ ముందు చూపు తో కేశవా పురం రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు ..అది త్వరలోనే అందుబాటు లోకి వస్తుంది..తాగు నీటి కష్టాలు తీర్చిన ప్రభుత్వ శ్రమ ను ప్రజలకు వివరించాలి..కరెంటు కష్టాలు తీర్చాము…ఆరేళ్లుగా శాంతి భద్రతల సమస్య లేదు..కర్ఫ్యూ లు లేవు…దమ్మున్న సీఎం ఇక్కడ ఉన్నారు కనుకే పెట్టుబడులు వరద లాగా వస్తున్నాయి..కృష్ణం రాజు అనే తెలిసినాయన యూపీ వెళితే అక్కడి సీ ఎస్ తెలంగాణ కు పెట్టుబడులు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు…హైదరాబాద్ తెలంగాణ కు ఆర్థిక ఇంజిన్ లాంటిది…హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది ..రైతులు సహా అందరూ బాగుంటారు…హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…ఆరేళ్లలో ఏం చేశామో వివరించి చెప్పాలి…కేంద్రం హైదరాబాద్ కు చేసిన ఒక్క పనైనా ఉందా అని ప్రజలను ప్రశ్నించాలి…అభివృద్ధి కావాలా ?అశాంతి కావాలా అని ప్రజలను అడగాలి…రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైన ఎన్నిక..ఎలాంటి హైదరాబాద్ కావాలో అంతటా చర్చ పెట్టాలి…రొటీన్ ఎన్నికలా దీన్ని కొట్లాడొద్దు ..ఇంటింటికి వెళ్ళాలి..కరోనా సమయం లో భరోసా ఇచ్చింది మనం…ప్రతిపక్షాలు ఎక్కడున్నాయి ?…వలస కార్మకులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే…వలస కార్మికుల నుంచి చార్జీల రూపం లో కేంద్రం డబ్బులు వసూలు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సేవలు అందించింది..వరదలు వచ్చినపుడు ప్రజల్లో ఉన్నాం..వరద సాయం చేశాం ..కేంద్రం మాత్రం బుడ్డ పైసా ఇవ్వలేదు…ghmc ఎన్నికల్లో ఓటేస్తే 25 వేలు ఇస్తామంటున్నారు…కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా ?…ట్రాఫిక్ చలాన్ల పై బీజేపీ అధ్యక్షుడు చెబుతున్న మాటలు చూసి నవ్వుకుంటున్నారు…గుజరాత్ లో చలాన్లు మీరే కడుతున్నారా ?…ధర్నా చేయడానికి భాగ్యలక్ష్మి గుడే దొరికిందా ?…బీజేపీ కి హిందూ ముస్లీమ్ గొడవలు కావాలి ,ఇండియా ,పాకిస్థాన్ చిచ్చు కావాలి…హైదరాబాద్ కు దమ్ముంటే లక్ష కోట్ల ప్యాకేజ్ బీజేపీ తేగలదా ?…పది రోజులు 24 గంటలు కష్ట పడాలి…28 న ఎల్ బి స్టేడియం లో సీఎం సభ ఉంటుంది…ఈ సారి ghmc లో సెంచరీ కొట్టాలి.