DailyDose

బీచ్‌లో లాఠీఛార్జి-నేరవార్తలు

బీచ్‌లో లాఠీఛార్జి-నేరవార్తలు

* బీచ్‌లో ఏర్పాటు చేసిన స్టాప్ స్పీడ్ బైక్ ర్యాలీలో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది.బైక్ ర్యాలీ సమయంలో హెల్మెట్ పంపిణీ సందర్భంగా తోపులాట జరిగింది.హెల్మెట్ల కోసం చాలా మంది ముందుకు దుకడంతో తోపులాట జరిగింది.ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలోనే ఈ గందర గోళం జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు.పోలీసులు స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్‌కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలన్నారు.అమెరికాలాంటి దేశాలతో సరి చూసుకోకూడదన్నారు. మన దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని, బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి రావాలన్నారు.సేఫ్ డ్రైవ్ చేయాలని, ఈవ్ టీజింగ్‌ను అందరూ వ్యతిరేకించాలని విజయసాయి పిలుపు ఇచ్చారు.

* నంద్యాలలో ఇటీవల కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసా, ఆమె కొడుకు, శంషావలి, కూతురు సాజీదా లను తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

* పటమట ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్ జరిగింది. కోటిన్నర విలువైన బంగారాన్ని మేనేజర్ వీరబాబు మాయం చేశాడు.

* సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది.జగతి పబ్లికేషన్స్ చార్జ్‌షీట్‌లో విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.జగతి పబ్లికేషన్స్, రాంకీ, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్లపై ఈనెల 23కి విచారణ వాయిదా వేశారు.పెన్నా, భారతీ సిమెంట్స్ ఛార్జ్‌షీట్లపై విచారణ ఈనెల 30కి వాయిదా వేశారు.ఎమ్మార్ కేసు విచారణ డిసెంబరు 16కి సీబీఐ, ఈడీ కోర్టు వాయిదా వేసింది.జగన్ కేసుల్లో ఈడీ ఛార్జ్‌షీట్లపై రేపు విచారణ జరగనుంది.

* టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు, శవ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.కరోనాతో తిరుపతి ఎంపీ చనిపోతే సంప్రదాయాలకు విరుద్ధంగా..చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారన్నారు.కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. స్థానిక ఎన్నికలు పెట్టాలని బాబు తహతహలాడుతున్నారన్నారు.

* ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ప్రయాగ్‌రాజ్-లఖ్‌నవూ రహదారిపై  ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఓ ట్రక్కు ఢీ కొట్టింది.ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు.