NRI-NRT

అమెరికాలోని 150 నగరాల్లో నిరుపేదలకు తానా సహాయం

TANA Helping COVID Affected Americans In 150 Cities

*** లక్ష డాలర్ల విలువైన ఆహారపదార్ధాల పంపిణీ
కోవిద్ కారణంగా ఇబ్బంది పడుతున్న అమెరికాలోని నిరుపేదలకు తానా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 150నగరాల్లో లక్ష డాలర్ల విలువైన ఆహారాన్ని విరాళంగా అందజేస్తున్నారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ విభాగ సమన్వయకర్త మల్లిఖార్జున వేమన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సమన్వ్యపరుస్తున్నారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తానా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మల్లిఖార్జున చొరవను అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి, మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు, తానా నేషనల్‌ కేర్స్‌ అధ్యక్షుడు‌ జోగేశ్వరరావు పెద్దిబోయినలు అభినందించారు.
అమెరికాలోని 150 నగరాల్లో నిరుపేదలకు తానా సహాయం-TANA Helping COVID Affected Americans In 150 Cities