Politics

GHMC ఆవిర్భావం అలా జరిగింది-TNI ఎన్నికల బులెటిన్

GHMC ఆవిర్భావం అలా జరిగింది-TNI ఎన్నికల బులెటిన్

* హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్‌ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కుత్బుల్లాపూర్‌ 125వ డివిజన్‌ గాజులరామారంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం సోదరుడు కూన శ్రీనివాస్‌గౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామపత్రాల పరిశీలన సమయంలో ఆయన నామినేషన్‌ను అధికారులు తొలగించారు. దీంతో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్‌, ఇతర కాంగ్రెస్‌ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో ఎస్సై మన్మదకు గాయాలయ్యాయి. కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలోకి ఎక్కిస్తుండగా పద్మ అనే మహిళ కింద పడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మాజీ ఎమ్మల్యే శ్రీశైలంగౌడ్‌ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.

* బాలా నగర్ చౌరస్తా కు చేరుకున్న టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకేటీఆర్ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే ఆరు ఏండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పనప్పుడు ఎం అవుతుందో అని ఆందోళన ఉండేఒక్కయనేమో తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్నాడు.ఆరు ఏండ్ల కింద ఎం అయిందో ఇక్కడ ఉన్న కడుతున్న బ్రిడ్జ్ అవుతుంది.ఫతే నగర్ లో బ్రిడ్జ్ ను మరింత విస్తరించుకుంటున్నమ్హైదరాబాద్ నగరంలో కొత్త కొత్త బ్రిడ్జ్ లు కనిపిస్తున్నాయిహైదరాబాద్ నగరంలో 5 రూపాయలకే అన్నం పెడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..లక్ష డబల్ బెడ్ రూమ్ లు పూర్తి అయ్యేయిత్వరలొనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారాంబిస్తాం.కేసీఆర్ సర్కారు వచ్చాక పేదల న్యాయం జరిగిందా లేదాతెలంగాణ రాష్ట్రం లో వృద్దులకు పెన్షన్ 2000 ,దివ్యఅంగులకు 3016 ఇస్తున్నాం వాస్తవం కాదా.

* గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. టిక్కెట్లు ఆశించి చివరి నిముషంలో భంగపడ్డ పలువురు తిరుగుబాట బావుట ఎగురవేశారు. అధికార టీఆర్ఎస్ సహా పార్టీలన్నీంటికి రెబల్స్ బెదడ తప్పడంలేదు. తిరుగుబాటు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బుజ్జగించేందుకు పార్టీల నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీ నుంచి అధిక సంఖ్యలో ఆశావహులు ఉండడంతో పోటీ తీవ్రంగా నెలకొంది. దీంతో టిక్కెట్ దక్కనివారు పలు డివిజన్లలో రెబల్స్గా నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ తరఫున కొన్ని చోట్ల రెబల్స్ బరిలో నిలిచినవారందరినీ బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింపచేసే ప్రకియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రానికి ఎంతమంది బరిలో నిలుస్తారనేది తేలనుంది. మల్కాజిగిరి 141 డివిజన్ లోని షికారి మల్లయ్య గార్డెన్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్ అభ్యర్థి మేకల సునీత రాము యాదవ్ ను బారి మెజారిటీ తో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 141 డివిజన్ లోని రాజా శ్రీనివాస నగర్ వెంకటగిరి కాలనీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తపస్వి ని యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్‌ నేతలు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి శనివారం ఎస్‌ఈసీని కలిశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రకటనల ఫ్లెక్సీలపై ఎస్‌ఈసీకి వారు ఫిర్యాదు చేశారు. మరో వైపు కాంగ్రెస్‌లో పలు అభ్యర్థిత్వాల ఖరారుపై అసంతృపి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనడంతో వాటి అభ్యర్థిత్వాల ఖరారుపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఐదు విడతలుగా దాదాపు 116 డివిజన్లకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసి జాబితా ప్రకటించింది. నామినేషన్‌ దాఖలు గడువు ముగిసినా మిగిలిన 34 స్థానాలకు అభ్యర్థిత్వ ఖరారును పెండింగ్‌లో పడేసింది. అయితే ఆ స్థానాలకు పోటీపడుతున్న ఆశవహులు మాత్రం నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్టీ అధిష్టానవర్గంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

* నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీ అభ్యర్థుల విజయానికి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ శనివారం సాయంత్రం నుంచి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, 6గంటలకు మూసాపేట చిత్తారమ్మతల్లి చౌరస్తా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రాత్రి 7 గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8 గంటలకు సాగర్‌ హోటల్‌ జంక్షన్‌లో నిర్వహించనున్నారు.

* ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్‌ 1న జరగబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కోసం వివిధ పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎలా ఏర్పడింది? తొలి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?అసలు ఈ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి.1869లో నిజాం ప్రభుత్వం తొలిసారి మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్‌, ఛాదర్‌ఘాట్‌ను రెండు మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పట్లో హైదరాబాద్‌లో నాలుగు, ఛాదర్‌ఘాట్‌లో ఐదు డివిజన్లు ఉండేవి. నిజాం సామ్రాజ్యంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన సాలార్‌జంగ్‌-1 ఈ రెండు మున్సిపాలిటీలకు మున్సిపల్‌ కమిషనర్లను నియమించారు. 1886లో ఛాదర్‌ఘాట్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారింది. ఆ సమయంలో 55చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేది. 1921లో ఇదే హైదరాబాద్‌ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్‌ఘాట్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి ‘హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు.1937లో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి.. 1942లో పలు కారణాల వల్ల హైదరాబాద్‌ మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్‌కు కార్పొరేషన్‌ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్‌ మున్సిపాలిటీని హైదరాబాద్‌ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్‌ హోదా కల్పించారు. 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు మాడపాటి హనుమంతరావు తొలి మేయర్‌గా పనిచేశారుమున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌1955లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం ద్వారా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎంసీహెచ్‌)’గా మార్చారు. 1956లో హైదరాబాద్‌ను ఆనాటి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిసార్లు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని, కొన్నిసార్లు ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగిస్తూ వచ్చారు. అత్యధికంగా కాంగ్రెస్‌ నాయకులే మేయర్లుగా ఉన్నారు. ఎంసీహెచ్‌లో నాలుగు జోన్లు, 7 సర్కిళ్లు ఉండేవి.జీహెచ్‌ఎంసీగా :హైదరాబాద్‌ చుట్టుపక్కల.. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీలు(ఎల్బీనగర్‌, గడ్డి అన్నారం, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు), 8 పంచాయతీలు (శంషాబాద్‌, సాతమరాయ్‌, జల్లాపల్లి, మామిడిపల్లి, మంఖల్‌, అల్మాస్‌గూడ, శారదానగర్‌, రావిలాల) కలుపుకొని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కాస్త గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)గా రూపాంతరం చెందింది. 2005లోనే గ్రేటర్‌హైదరాబాద్‌ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని 2007 ఏప్రిల్‌ 16న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవిర్భవించింది. 175చ.కి.మీ విస్తీర్ణంలో 45లక్షల జనాభా ఉన్న ఎంసీహెచ్‌ గ్రేటర్‌హైదరాబాద్‌గా మారడంతో విస్తీర్ణం 650చ.కి.మీకు పెరిగింది. జనాభా 2007నాటికి 67లక్షలు ఉండగా ప్రస్తుతం కోటి దాటింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉన్నాయి. మేయర్లుగా 2002-07లో తీగల కృష్ణారెడ్డి, 2009-12లో బండ కార్తీకరెడ్డి, 2012-16లో మహ్మద్‌ మాజిద్‌ హుస్సేన్‌ ఉన్నారు. 2014లో తెలంగాణ వచ్చింది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ పాలక మండలి మరో మూడు నెలల్లో ముగియనుండగా.. తాజాగా ఎన్నికల నగారా మోగింది. తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. మరి జీహెచ్‌ఎంసీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.