DailyDose

ఇద్దరు సిఐలు ఒక కానిస్టేబుల్‌పై కేసు నమోదు-నేరవార్తలు

Crime News - Case Filed Against Two CIs And Constable

* ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుని, సాక్ష్యాలను తిన్నారనే ఆరోపణలతో పలువురు పోలీసులపై కేసు నమోదు చేయాలని వరంగల్ ఫస్ట్ అదనపు జ్యుడిషియల్ ఇంటర్జ్జ్మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు.వరంగల్ చౌరాస్త వద్ద ఉమ్మడి ఆస్తిపై ధీరజ్ రెడ్డి, మామ జన్నపురెడ్డి రాజిరెడ్డి మధ్య వివాదం కొనసాగుతోందని న్యాయవాది ధీరజ్ రెడ్డి బాధితుడు తెలిపారు. జూలైలో, రాజీరెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు ధీరజ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు మరియు ఇంతర్ గంజ్ పోలీసులు ఆస్తి నష్టంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎం శ్రీనివాస్ (ఇప్పుడు సిఐడి వి పార్ట్‌లో సిఐ), సిఐ ఆర్ వెంకటేశ్వర్ పౌర విషయాలకు పాల్పడ్డారని, సాక్ష్యాలు తరు మారు చేసి అక్ర మాంగా కేసు నమోదు చేశారని ధీరజ్ రెడ్డి కోర్టులో ప్రైవేట్ కేసు పెట్టారు. సిఐడి సిఐ ఎం శ్రీనివాస్, సిఐ ఆర్ వెంకటేశ్వర్లు పాటు కానిస్టేబుల్స్ ఎం కిషన్ కుమార్, జన్నాపురెడ్డి రాజిరెడ్డి సాత్విక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. వరంగల్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇంటెజర్ గంజ్ పోలీసులు తెలిపారు.

* వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని చింతల్ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్(28) పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు. పని ముగించుకుని ఇంటికి వస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చింతల్ వద్ద రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. అదే సమయంలో వచ్చిన ఏడీఆర్‌ఎం స్పెషల్‌ రైలు సునీల్‌ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేమాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

* తిరుమల లో హైదరాబాద్ కి చెందిన భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వకులామాత అతిథి గృహం 511 లో హైదరాబాద్ కి చెందిన శ్రీధర్ ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడి నారు.తన మేనల్లుడు తో కలిసి దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న శ్రీధర్ నిన్నటి రోజున ఒక్కడే తిరుమల కు చేరుకుని వసతి గదిని పోందారు.స్వామి వారిని దర్శించు కొని లడ్డు ప్రసాదాలు సైతం పోందారు. అటు తరువాత వసతి గదికి చేరుకోని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీధర్.వసతి గది తీసుకుని 24 గంటలు అవుతున్నా ఖాళీ చేయక పోవడంతో మొబైల్ ద్వారా సంప్రదించినా ఎలాంటి స్పందన లేక పోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.గది తలుపులు పగలగొట్టి చూడగా శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద బెంజ్ కార్ బీభత్సం..జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు నుండి అతివేగంగా వచ్చి ఇండికా క్యాబ్ ఢీ కొట్టిన బెంజ్ కార్..ఇండికా క్యాబ్ లో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు..ఓ పబ్ లో పీకలదాకా తాగి రోడ్డు పైకి వచ్చిన మందుబాబులు..కారులో ముగ్గురు యువకులు,ఓ అమ్మాయి ఉన్నారు..కారు నడిపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు..ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 3 వద్దఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్ గా మారింది..తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు..అక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని అంటున్న వాహనదారులు.