Fashion

ఇటీవల పెళ్లిళ్లు పెటాకులుగా మారడానికి కారణాలు ఏమిటి?

ఇటీవల పెళ్లిళ్లు పెటాకులుగా మారడానికి కారణాలు ఏమిటి?

ప్రస్తుతం పెళ్లి అయిన తరువాత చాలా జంటలు విడాకుల కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు గొడవలు పడుతున్నారు. ఎందుకు వస్తున్నాయి ఈ అకారణ వివాదాలు?
ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు కొందరు.
ఇంతకుముందు రోజుల్లో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ఎప్పుడు కలుసుకుందామా అని ఎదురుచూస్తూ పెళ్లిగడియ వరకు ఎంతో ఆదుర్దాగా ఎదురుచూసే వారు. కనీసం మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అంతలా కట్టుబాట్లలో పెంచేవారు. కానీ నేడు ఆపరిస్థితులు లేవు.
జీవితం వేగం పెరిగిందంటూ సెల్ ఫోన్స్(దూరవాణి), ఇంటర్నెట్ (అంతర్జాలం) వచ్చాయి. పెళ్లి కుదరడమే ఆలస్యం గంటల గంటలు, రేయింబవళ్ళు ఒకటే సొల్లు. పోని పెళ్లి అయిన తరువాత కూడా కుదురుగా ఉంటారా అంటే అదీలేదు. ఇంటిదగ్గర బయలుదేరింది మొదలు మళ్లి ఇంటికి వచ్చేవరకు ”టిఫిన్ తిన్నావా, టీ తాగావా? అన్నం తిన్నావా, జ్యూస్ తాగావా? బుజ్జి, బంగారం,” అని ఒకటే మాటలు. మాట్లాడినవారు మాట్లాడినట్టే ప్రతి అరగంటకి ఎవరు ఏమి చేస్తున్నారో తెలుసుకోకపోతే నిద్రపట్టదు.
ఇంత మాట్లాడుకుని ఇంటికి వచ్చి ఏమి మాట్లాడుకుంటారు. మొత్తం ఆరోజు విశేషాలన్ని అప్పటికే వినేశారు. ఇలా కొన్నాళ్ళకి విసుగోచ్చేస్తుంది. ఎప్పుడూ అవే మాటలు కదా! విని విని చిరాకోచ్చేస్తుంది. ఇక తరువాతి ఘట్టం గొడవలు. పెళ్ళికి ముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. నామీద ప్రేమలేదు అని వాదనలు. అవి చిలికి చిలికి గాలివాన ప్రారంభమై ఆగోడవల్లో కొట్టుకెళ్ళి కొందరు కోర్టు దగ్గర తేలుతున్నాయి. ఇంకొందరు అక్రమ సంభంధాలకి పాల్పడుతున్నారు. ఇదంతా జరిగేది కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో.
ఈమధ్య చాలామందిని రీసర్చ్ చేస్తే లభించిన విశేషాలు ఇవి. ముఖ్యంగా కాపురాలు కూలడానికి కొత్త టెక్నాలజీ ప్రభావం బాగా ఉంది. కనుక ఆత్రుత పడి అతితెలివికి పోకుండా, వీలైనంత తక్కువ మాట్లాడి ఎక్కువకాలం కలిసి ఉండండి. ఎక్కువ మాట్లాడటం, అతిగా ప్రేమించడం వలన కలిగే అనర్ధాల వలన మీపిల్లల జీవితాలని అంధకారంలో పడేయకండి. జీవితాలు నరకప్రాయం చేసుకోకండి. గొడవలు లేకుండా అందరు హాయిగా కలిసి ఉండాలనేదే ఈ సందేశం ఉద్దేశ్యం…