WorldWonders

బిట్‌కాయిన్ $20వేల మార్కును దాటుందంట!

బిట్‌కాయిన్ వేల మార్కును దాటుందంట!

బిట్‌కాయిన్‌ విలువ కొన్నాళ్లుగా పరుగులు పెడుతోంది. తాజాగా మంగళవారం నాటికి ఇది 19,000 డాలర్ల మార్కును చేరింది. అంటే మన కరెన్సీలో రూ.14లక్షల పైచిలుకు అన్నమాట. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ బ్లాక్‌ఛైన్‌ ఆధారిత కరెన్సీ ర్యాలీ చేస్తోంది. మరికొన్నాళ్లలో 20వేల డాలర్ల మార్కును కూడా దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 ఒక్క సంవత్సరంలోనే బిట్‌కాయిన్‌ 160శాతం విలువ పెరిగింది. ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా ఉండటం.. పరపతి విధానాల్లో తరచూ మార్పులు చోటు చేసుకోవడం వంటి కారణాలతో దీని విలువ పెరుగుతూ వస్తోంది. ఒక్క నవంబర్‌ నెలలోనే ఇది 37 శాతం పెరిగిందంటే దూకుడు అర్థం చేసుకోవచ్చు. 2017లో ఈ క్రిప్టోకరెన్సీ విలువ 1,375 శాతం పెరిగి 20,000 డాలర్లను చేరింది. ఆ మరుసటి సంవత్సరమే గణనీయంగా 70 శాతం మేర విలువను కోల్పోయింది. ఆ తర్వాత మళ్లీ కోలుకుంటూ ఇప్పుడు 20,000 డాలర్లను సమీపిస్తోంది.