Politics

తెలంగాణా ప్రజలు మార్పు కోరుతున్నారు-GHMC-TNI బులెటిన్

GHMC 2020 Bulletin - Kishanreddy Says Telangana People Wanting Change

* ప్రజలు మార్పుకోరుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా భాజపాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని.. తమ పార్టీకి యువత, విద్యార్థులు, మహిళలే బలమన్నారు. చాలాచోట్ల యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భాజపాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

* బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని చెడగొడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ మాణికం ఠాగూర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తోందని, వారి అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందని దుయ్యబాట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ప్రొజెక్టులోను టీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిందని అది అవినీతి ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై అమిత్ షా సీబీఐ విచరణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎంపీ బండి సంజయ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నాడని ఫైర్‌ అయ్యారు.

* టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్రం పెట్టిన బిల్లులకు టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు సీఎం కేసీఆర్ మద్దతు పలికారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజకీయ అవగాహన లేదని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో చిల్లర కార్పొరేటర్‌గా గెలిచిన బండి సంజయ్‌.. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌కి హైదరాబాద్ ఎక్కడుందో సరిగా తెలియదని, అలాంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఇలాగే ఉంటుందని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు.

* ముఖ్యమంత్రి సహాయనిధిని నగరంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని, హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయన బుధవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని మారియెట్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘హుషార్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావం అన్ని రంగలమీద పడిందని, నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

* ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్’‌ భారతీయ జనతా పార్టీ విధానమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలర్పించారు. వాళ్ల కుటుంబాల గుండెలు పగిలాయి. అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగింది. వరదల్లో 80 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. దుబ్బాక ఉపఎన్నికతో తెలంగాణ ప్రజల సపోర్ట్‌ అధికార పార్టీకి లేదని తెలిసిపోయింది.
రాజకీయ లబ్ధికోసమే వారికి ఓటు : అక్రమ చొరబాటుదారలుకు, రోహింగ్యాలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఎలా కల్పించారు. రాజకీయ లబ్ధికోసమే రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. అక్రమ చొరబాటు దారుల విషయంలో పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశ సంపద దేశ ప్రజలే అనుభవించాలి. ఎంఐఎం-టీఆర్‌ఎస్‌ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. పారదర్శక పాలన కోసం బీజేపీకి పట్టాం కట్టాలని కోరుతున్నాం. 920 కోట్ల రూపాయలు ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాం. టెక్నికల్ టెక్స్‌ టైల్స్ కోసం కేంద్రం 1,000 కోట్లు కేటాయించింది. చిల్డ్రన్ వాక్సినేషన్, ఉపాధి ఆవకాశాలు అందకుండా చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో 75 వేల టీఆర్‌ఎస్‌- ఎంఐఎం డ్రామాలాడుతున్నాయి : తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణకు అదేశించదు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు.. ప్రభుత్వ పథకాలు అన్ని ఎందుకు పాతబస్తీకి చేరడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటది. ఎంఐఎం ఎమ్మెల్యే లేఖలు ఉన్నా ప్రభుత్వం విచారణ చేయడం లేదు. టీఆర్‌ఎస్‌- ఎంఐఎం తెలంగాణ రాష్ట్రంలో మిత్ర పార్టీలు. రెండు పార్టీలు కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయి’ అంటూ స్మతి ఇరానీ వ్యాఖ్యానించారు.

* టీఆర్ఎస్, ఎంఐఎంలపై కేంద్ర మంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయి నిబంధనలకు విరుద్దంగా రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయని ఆమె ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాదు వచ్చిన స్మృతి ఇరానీ బుధవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు.రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎంఐఎం లేఖ రాసిందని, తమ పార్టీ లెటర్ హైడ్ మీద ఆ లేఖ రాసిందని ఆమె ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం అక్రమ చొరబాటుదార్లకు మద్దతు ఇస్తారా అని ఆమె అడిగారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లది అవినీతి కూటమి అని ఆమె అన్నారు. అక్రమ చొరబాటుదారులపై టీఆర్ఎస్ ఆధారపడిందని ఆమె ఆరోపించారు.అక్రమ చొరబాటుదారుల విషయాన్ని బిజెపి బయటపెట్టిందని ఆమె అన్నారు. అక్రమ చొరబాటు దారులను ఓటర్ల జాబితాలో చేర్చడం ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర అని ఆమె అన్నారు.అక్రమ చొరబాటుదారుల విషయంపై బిజెపి స్పష్టమైన వైఖరి ఉందని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని ఆమె అన్నారు. బిజెపికి టీఆర్ఎస్ భయపడుతోందని ఆమె అన్నారు. దుబ్బాకలో బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆమె విమర్శించారు. వరదల వల్ల హైదరాబాదు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని ఆమె అన్నారు. హైదరాబాదు వరదల్లో 80 మంది మరణించారని ఆమె చెప్పారు.తెలంగాణ కోసం పలువురు అమరులయ్యారని, తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ఆమె అన్నారు. హైదరాబాదులో 75 వేలకు పైగా అక్రమ కట్టడాలున్నాయని ఆమె అన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ బిజెపి నినాదమని ఆమె అన్నారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయమని, బిజెపి కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆమె అన్నారు.