Food

దంతాలు ఎముకల బలానికి రొయ్యలు తినాలి

దంతాలు ఎముకల బలానికి రొయ్యలు తినాలి

నోరు బాలేనప్పుడు, నాలుక చేదుగా అనిపించినప్పుడు నాలుగు రొయ్యలను నోట్లో వేసుకోకపోతే.. మాంసాహారులకు మనసొప్పదు. అందుకే మాంసాహారులు ఎక్కువగా రొయ్యలను తింటారు. ఎక్కువగా రొయ్యల వేపుళ్లను, ఇగుర్లను తింటారు. తిన్నంతసేపు బానే ఉంటుంది.. తిన్న తరువాత అనారోగ్య భయం వెంటాడుతుంది. కానీ అనవసర భయాలు వద్దంటున్నారు ఆరోగ్యనిపుణులు.. ఎందుకంటే బలానికి రొయ్య చాలా మంచిది అని చెబుతున్నారు వారు. వివరాల్లోకి వెళితే..
* సముద్ర ఆహార ఉత్పత్తుల్లో రొయ్యలంత బలవర్ధకమైన ఆహారం మరొకటి లేదు. వీటిలోని సెలీనియం అనే పదార్థం క్యాన్సర్ కారక నివారిణి. క్యాన్సర్ సెల్స్ అడ్డదిడ్డంగా పెరగకుండా అడ్డుకుంటుంది.
* రొయ్యల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె శ్రేయస్సుకు పాటుపడటం.., రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించి రక్తసరఫరాలకు సులభమైన మార్గం ఏర్పాటు చేయడం.., అధిక రక్తపోటును నిలువరించే గుణాలు ఫ్యాటీ యాసిడ్స్‌లో ఉంటాయి. ఇన్ని లాభాలు రొయ్యల్లోనే అధికంగా ఉంటాయి. రొయ్యలు శరీరానికే కాదు, మెదడుకూ చాలా అవసరం. ఇవి మెదడుకు మేతనిస్తాయి. మెదడుకు తగిన పోషక విలువలు అందకపోతే వచ్చే సమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. రొయ్యలు తింటే ఈ మతిమరుపు జబ్బు అంత త్వరగా రాదు.
* దంతాలు, ఎముకలు బలంగా ఉన్నన్నాళ్లు మనిషి అంత త్వరగా నీరసపడిపోడు. ఇవి రెండూ అంత బలంగా ఉండాలంటే పుష్కలమైన కాల్షియం అవసరం. అది రొయ్యల్లో ఎక్కువ.
* చర్మం ఎంత నాజూగ్గా ఉంటే అంత అందంగా కనిపిస్తాయి. అయితే చర్మసౌందర్యానికి అవసరమైన ‘విటమిన్ ఇ’ని అందించడంలో మాత్రం అంత శ్రద్ధ కనబరచం. ఆ లోటును భర్తీ చేయాలంటే రొయ్యల్ని తప్పనిసరిగా తినాలి. వీటిలో విటమిన్ – ఇ దండిగా దొరుకుతుంది. చర్మానికి కావాలసిన పోషకాలు దొరికినప్పుడు మెరవమంటే ఎందుకు మెరవదు.
* గుండెలోని రక్తనాళాల్లో పూడికలు రాకుండా, జ్ఞాపకశక్తి లోపించకుండా ఉండాలంటే మిటమిన్ బి12 అవసరం. రొయ్యలో ఈ రకం విటమిన్లకు కొదవలేదు. ప్రొటీన్లు శరీర శక్తికే కాదు.. శరీరంలో ఎక్కడ ఏ డ్యామేజ్ జరిగినా తిరిగి కోలుకోవడానికి తక్షణ అవసరపడతాయి. అందుకని అత్యధిక ప్రొటీన్లు కలిగిన రొయ్యల్ని తింటే సరి. మిగిలిన మాంసాహారంతో పోలిస్తే.. తక్కువ కేలరీలు ఉన్నది రొయ్యల్లోనే.. సులువుగా కూడా జీర్ణమవుతాయి. రొయ్యలు తిని బరువు కూడా తగ్గొచ్చు. ఇన్ని మంచి లక్షణాలున్న రొయ్యల్ని తినకుండా వదిలేస్తారా? లేదు కదూ.. *